ఆటో అమ్మకాల వృద్ధి అంతంతే...
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:25 AM
దేశంలో ప్రముఖ కార్ల తయారీదారులైన మారుతి సుజుకీ, హ్యుండయ్ మార్చి నెలలో నిరాశావహమైన అమ్మకాలు నమోదు చేశాయి. ఇన్వెంటరీలో...

మారుతి, హ్యుండయ్ అమ్మకాల్లో క్షీణత
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ కార్ల తయారీదారులైన మారుతి సుజుకీ, హ్యుండయ్ మార్చి నెలలో నిరాశావహమైన అమ్మకాలు నమోదు చేశాయి. ఇన్వెంటరీలో దిద్దుబాటు, డిమాండ్ క్షీణత ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఇదే సమయంలో ఎస్‌యూవీలకు ఏర్పడిన డిమాండుతో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ గత ఏడాది మార్చితో పోల్చితే అమ్మకాల్లో వృద్దిని సాధించాయి. మార్చి నెలలో మారుతి సుజుకీ అమ్మకాలు 1 శాతం తగ్గి 1,50,743కి పరిమితం అయ్యాయి. గత ఏడాది మార్చిలో కంపెనీ 1,52,718 యూనిట్లు విక్రయించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కంపెనీ దేశీయ విక్రయాలు స్వల్పంగా పెరిగి 17,60,767కి చేరాయి. 2023-24 సంవత్సరంలో విక్రయాలు 17,59,881గా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News

పెట్రో ప్రైస్ ఎఫెక్ట్.. అవి పెరిగాయి..ఇవి తగ్గాయి

చివరికి నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

ఇండియన్ స్టాక్ మార్కెట్.. ఐదు బిగ్గెస్ట్ క్రాషెష్ ఇవే..

అసలు స్టాక్ మార్కెట్ నష్టాలు ఎందుకు..ఇవే కారణాలు

భారీ నష్టాల భయం..ఈ దేశాల స్టాక్ మార్కెట్లు నిలిపివేత
