Share News

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:05 PM

Student: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటు చేసుకొంది. ఓ యువతిని బంధించి ఒకటి రెండు రోజుల కాదు.. వారం రోజులపాటు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. హోటళ్లు మారుస్తూ.. ఆ యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

వారణాసి, ఏప్రిల్ 07: ఒకటి,రెండు రోజుల కాదు.. ఏకంగా వారం రోజుల పాటు యవతిని బంధించి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుణ జోన్ డీసీపీ చంద్రకాంత్ మీనా కథనం ప్రకారం.. ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోన్న యువతి.. స్పోర్ట్స్ కోర్సులో చేరాలని భావించింది. ఆ క్రమంలో యూపీ కాలేజీకి ప్రతి రోజు వెళ్లి.. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తోంది.


అయితే మార్చి 29వ తేదీన స్థానిక పిషాచ్‌మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కు ఆమెను ఓ స్నేహితుడు తీసుకు వెళ్లాడు. అక్కడ వీరితో మరికొంత మంది యువకులు కలిశారు. అనంతరం ఆ యువతకి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆ డ్రింక్ తాగిన ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత సిగ్రా ప్రాంతంలోని పలు హోటళ్లకు ఆ యువతిని తిప్పితూ.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఈ విధంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారని వివరించారు.


ఆ తర్వాత సదరు యువతి ఇంటికి చేరుకొని.. జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో లాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా హుక్కా బార్‌లోని సీసీ ఫుటేజ్‌‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే తనపై ఈ దారుణానికి పాల్పడిన వారిలో.. ఇన్ స్టాగ్రామ్‌లో తనకు పరిచయస్తులని.. గతంలో తనతో కలిసి చదువుకొన్న స్నేహితులు కూడా ఉన్నారని యువతి వివరించారు.


తొలుత తన స్నేహితుడితో.. హుక్కా బార్‌కు వెళ్లేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు తమ దర్యాప్తులో యువతి స్పష్టం చేసిందన్నారు. మరోవైపు ఈ యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఏప్రిల్ 4వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని..అదే రోజు ఈ యువతిని గుర్తించామని చెప్పారు. అయితే ఆ రోజు తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు యువతి కానీ.. ఆమె కుటుంబ సభ్యలు కానీ తమకు ఫిర్యాదు చేయలేదని డీసీపీ చంద్రకాంత్ మీనా స్పష్టం చేశారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీసీపీ వివరించారు.

ఇవి కూడా చదవండి..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 06:12 PM