Share News

Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం

ABN , Publish Date - Apr 07 , 2025 | 09:34 AM

భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.

Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్..నిమిషాల్లోనే లక్షల కోట్ల నష్టం
Sensex Drop 3300 Points

నేడు (ఏప్రిల్ 7న) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం భయాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం సహా పలు కారణాలతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 3,379.19 పాయింట్లు తగ్గి 71,985.50 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 901.05 పాయింట్లు పడిపోయి 22,003.40 పరిధిలో ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1,431 పాయింట్లు దిగజారగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 2,056 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే 45 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.


ఈ రంగాలు కూడా..

ఈ క్రమంలో అన్ని రంగాలు కూడా నెగటివ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ మెటల్ 7% కంటే ఎక్కువ నష్టపోయి ఎక్కువగా క్షీణించింది. ఆ తర్వాత, ఐటీ రంగం కూడా దాదాపు 7% నష్టంతో పతనమైంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 5% కంటే ఎక్కువ నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కూడా 4% కంటే ఎక్కువ తగ్గింది. 30 షేర్ BSE సెన్సెక్స్‌లో భారతి ఎయిర్‌టెల్ మాత్రమే లాభాలను నమోదు చేసింది.


ట్రేడర్లకు అలర్ట్..

ప్రస్తుతం నష్టాల్లో ఉన్న కంపెనీలలో ట్రెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో టాప్ 5లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ 9.3% నష్టాన్ని ఎదుర్కొగా, టాటా స్టీల్ 9.2% నష్టంతో ఎక్కువగా క్షీణించింది. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ 4 శాతం తగ్గిన నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 4-6 శాతం క్షీణత నమోదైంది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా చూపించింది. ఈ క్రమంలో మార్కెట్ ట్రేడర్లు, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


రూపాయి కూడా..

వాణిజ్య భయాలు పెరిగిన నేపథ్యంలో, భారత రూపాయి రెండు నెలల వ్యవధిలో అత్యంత బలహీనమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. ముడి చమురు ధరలు స్థిరంగా తగ్గినా, రూపాయి విలువ తగ్గిపోయింది. శుక్రవారం 85.24 వద్ద ముగిసిన తరువాత, దేశీయ కరెన్సీ గ్రీన్‌బ్యాక్‌తో పోల్చితే ఈరోజు 41 పైసలు తగ్గి 85.65 వద్ద ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 తర్వాత, రూపాయి విలువ తాజాగా భారీగా పడిపోవడం విశేషం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు గణనీయంగా దిగజారినప్పటికీ, మార్కెట్ విశ్లేషకులు,పెట్టుబడిదారులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిస్థితులపై కన్నేస్తున్నారు. వీటితో పాటు, లోకల్ మార్కెట్లలో పెట్టుబడులు మద్దతు స్థాయిలను కూడా పరిశీలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

YouTube: యూట్యూబ్ నుంచి క్రేజీ ఫీచర్..ఇకపై షార్ట్స్ క్రియేషన్స్ మరింత ఈజీ


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 01:23 PM