తుది తీర్పుకు లోబడే ‘రిస్డిప్లామ్’ ఔషధం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:20 AM
రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం మార్కెట్లోకి విడుదల చేయడం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని నాట్కో ఫార్మా వెల్లడించింది. తమ రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం ధర కూడా....

మా ధర రూ.15,900 మాత్రమే: నాట్కో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం మార్కెట్లోకి విడుదల చేయడం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటుందని నాట్కో ఫార్మా వెల్లడించింది. తమ రిస్డిప్లామ్ జెనరిక్ ఔషధం ధర కూడా డోసు రూ.15,900 మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం ఇదే పేటెంట్ ఔషధాన్ని స్విస్ ఫార్మా కంపెనీ రోచే రెండేళ్లకు రూ.72 లక్షల చొప్పున, ఆ తర్వాత ఏడాదికి రూ.56 లక్షల చొప్పున విక్రయిస్తోంది. అరుదైన వెన్నుపూస కండరాల క్షీణత (ఎస్‌ఎంఏ) వ్యాధి చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోచె ఫార్మా ఒక్కటే ఈ పేటెంటెడ్ ఔఽషధాన్ని ‘ఎవరిస్డీ’ పేరుతో మన దేశంలో మార్కెట్ చేస్తోంది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌పై రోచెకు 2035 వరకు పేటెంట్ హక్కులు ఉన్నాయి.