Share News

నేడే ఆర్‌బీఐ పాలసీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:15 AM

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్రవ్య పరపతి విధానం బుధవారం ప్రకటించనున్నారు...

నేడే ఆర్‌బీఐ పాలసీ

ముంబై: భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా 2025- 26 ఆర్థిక సంవత్సరానికి తొలి ద్రవ్య పరపతి విధానం బుధవారం ప్రకటించనున్నారు. ఈసారి కూడా ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చన్న ఊహాగానాల నడుమ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం కోసం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మల్హోత్రా సారథ్యంలోని ఎంపీసీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. కాగా బుధవారం ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తారని ఆర్‌బీఐ తెలిపింది.

Updated Date - Apr 09 , 2025 | 05:33 AM