Share News

కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు..

ABN , Publish Date - Apr 09 , 2025 | 10:53 AM

Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది.

కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు..
Reserve Bank Of India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది. ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించటం విశేషం. ఆర్‌బీఐ నిర్ణయంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.


వడ్డీ రేట్లు తగ్గించటంపై ఆర్‌బీఐ గవర్నర్ బుధవారం మాట్లాడుతూ.. ‘ రెపో రేటు తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం రెపో రేటును తగ్గించటం ఇది రెండో సారి. ప్రపంచ స్థాయిలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలపై ఆర్‌బీఐ ఓ కన్నేసి ఉంచింది. దిగుమతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అత్యధిక స్థాయిలో టారిఫ్ విధించారు. ఆ టారిఫ్‌ల కారణంగా ఎగుమతులపై ప్రభావం పడుతుంది.’ అని అన్నారు.


ఇంతకీ రెపో రేటు అంటే ఏమిటి?

రెపో రేటును రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజ్ ఆప్చన్ అని కూడా అంటారు. కొన్ని కమిర్షియల్ బ్యాంకులు క్వాలిఫైయింగ్ సెక్యూరిటీలు అమ్మి ఆర్బీఐనుంచి లోన్లు తీసుకుంటాయి. ఆ లోన్ల మీద వడ్డీ రేటును రెపో రేటు అంటారు. రెపో రేటును వాడుకుని ఆర్బీఐ అద్భుతాలు చేస్తుంది. రెపో రేటు ద్వారా మార్కెట్‌లో మనీ ఫ్లోను కట్టడి చేస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా మార్కెట్‌పై ప్రభావం పడితే... రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు పెరిగితే ఆర్బీఐ నుంచి ఇతర బ్యాంకులు తీసుకునే లోన్ల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు లోన్లు తీసుకోవటం తగ్గిస్తాయి. మార్కెట్‌లో మనీ ఫ్లో తగ్గుతుంది. తద్వారా మార్కెట్‌పై ద్రవ్యోల్బణం ప్రభావం ఉండదు.


ఇవి కూడా చదవండి:

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..

ఫ్యామిలీ వివాదం మళ్లీ రగిలింది

Updated Date - Apr 09 , 2025 | 11:41 AM