Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:19 PM
క్రికెట్ ప్రియులకు కీలక అప్‌డేట్. దిగ్గజ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తాజాగా GEPLలో ముంబై ఫ్రాంచైజీ యజమానిగా మారారు. దీంతో GEPL సీజన్ 2 కొత్త మార్పులతో మరింత ఉత్సాహభరితంగా మారనుంది.

ఐపీఎల్ 2025లో ఇప్పటికే కావ్యాను చూస్తున్న క్రికెట్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar).. గ్లోబల్ ఇ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (GEPL) సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి, యజమానిగా మారారు. ఈ విషయాన్ని డిజిటల్ ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన జెట్ సింథసిస్ ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-క్రికెట్ వినోద లీగ్ అయిన GEPL, 300 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. దీని ప్రారంభ సీజన్ నుంచి లీగ్ వేగవంతమైన వృద్ధిని సాధించింది. ఆటగాళ్ల ఆసక్తిలో ఐదు రెట్లు పెరుగుదలతో, సీజన్ 1లో 200,000తో పోలిస్తే 910,000 రిజిస్ట్రేషన్లకు చేరుకుంది.