Share News

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

ABN , Publish Date - Jan 04 , 2025 | 02:05 PM

మీరు తక్కువ మొత్తంతో భారీ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా. అయితే మీకు మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడులు బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు 7 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకుంటే నెలకు ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Investment Tips

ఇటివల కాలంలో సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లలో భారీ మొత్తంలో మదుపు చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ SIP దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో వారు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు 7 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకుంటే (Investment Tips) నెలకు ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

5000 రూపాయలు సిప్ చేస్తే

మీరు రూ. 5000 SIP చేస్తే 10 సంవత్సరాలలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 అవుతుంది. ఆ క్రమంలో మీరు సగటున 12 శాతం రాబడిని పొందినట్లయితే, మీరు రూ. 5000 SIPతో 10 సంవత్సరాలలో దాదాపు రూ. 11.61 లక్షల కార్పస్‌ను పొందవచ్చు. మీరు ప్రతి సంవత్సరం సగటున 15 శాతం రాబడిని పొందినట్లయితే మీరు దాదాపు రూ. 13.93 లక్షల మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.


రూ. 15 వేలు సిప్ చేస్తే

ఒక వేళ మీరు రూ. 15,000 సిప్ చేస్తే 33 సంవత్సరాలలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 59,40,000 అవుతుంది. మీరు ప్రతి సంవత్సరం సగటున 12 శాతం రాబడిని పొందినట్లయితే, మీరు 33 ఏళ్ల తర్వాత రూ. 7,64,09,971 కోట్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు వడ్డీ రూపంలోనే రూ. 7,04,69,971 కోట్లు పొందడం విశేషం. ఒక వేళ మీకు సగటు వడ్డీ రాబడి శాతం 12 శాతం కంటే ఎక్కువ వస్తే మీకు మరింత మనీ వచ్చే ఛాన్సుంది.


మ్యూచువల్ ఫండ్‌లో సిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • సిప్ చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం వల్ల మీలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది

  • మీరు 100 రూపాయల నుంచి కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు

  • సిప్ ప్రయోజనం ఏమిటంటే మీరు మార్కెట్‌లోని అన్ని హెచ్చు తగ్గుల ద్వారా పెట్టుబడి పెట్టడం

  • ఈ కారణంగా మీ పెట్టుబడి సగటును పొందుతూనే ఉంటుంది. దీంతో మీరు దీర్ఘకాలంలో మంచి డబ్బు సంపాదించవచ్చు.

  • మీ ఆదాయం పెరిగే కొద్దీ మీరు SIPని పెంచుకోవచ్చు. ఇది మంచి రాబడిని పొందడానికి మీకు సహాయపడుతుంది

  • మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీరు మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రయోజనాన్ని పొందవచ్చు

  • సిప్ ప్రతికూలత ఏమిటంటే మీరు ఏదైనా సిప్ వాయిదాను మరచిపోతే, మీరు పెనాల్టీ చెల్లించాలి


ఇవి కూడా చదవండి:

Piyush Goyal: ఈవీలకు సబ్సిడీలు అవసరం లేదు.. వారే స్వయంగా చెప్పారు


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 04 , 2025 | 02:43 PM