Share News

Credit Card: క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ పే చేయడం మంచి ఐడియానా.. కాదా..

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:11 PM

Minimum Due on Credit Card: ఇప్పుడు చాలామంది ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ భారం కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది చెల్లింపుల కోసం మినిమం డ్యూ ఆప్షన్‌నే ఎంచుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనదా.. కాదా.. మినిమం డ్యూ ఆప్షన్ ఎంచుకుంటే లాభాలేంటి.. నష్టాలేంటి.. వివరంగా తెలుసుకుందాం..

Credit Card: క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ పే చేయడం మంచి ఐడియానా.. కాదా..
Credit Card Minimum Due Payment Benefits and Losses

Credit Card Bill Payments: క్రెడిట్ కార్డుల వినియోగం సర్వసాధారణంగా మారింది. అయినప్పటికీ, చాలామందికి క్రెడిట్ కార్డులు ఎలా ఉపయోగించాలో సరిగా అవగాహన లేదు. ఎక్కువమంది ఆఫర్లు, రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్స్ వస్తాయని ఆన్‌లైన్ షాపింగ్ కోసమే వాడుతుంటారు. అయితే, బిల్ పేమెంట్ విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. తక్కువ ఇన్‌స్టాల్‌మెంట్లో తీసుకున్న రుణం చెల్లించలేకపోతే వడ్డీలు కట్టాలనే భయం ఉంటుంది. అందుకని సేఫ్ సైడ్ ఆప్షన్‌గా ఒకేసారి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పని లేకుండా మినిమం డ్యూ ఆప్షన్ ఎంచుకుంటారు. ఇంతకీ, ఈ ఐడియా మంచిదా.. కాదా.. దీర్ఘ కాలంలో క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.


మినిమం డ్యూ చెల్లించడం వల్ల కలిగే లాభాలు:

  • లేట్ ఫీజుల నుంచి రక్షణ:

    లేట్ ఫీజుల భారం అధికంగా ఉండటమే కాదు. క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. సమయానికి మినిమం డ్యూ చెల్లిస్తే లేట్ పేమెంట్ ఫీజులను నివారించవచ్చు. సకాలంలో పే చేస్తే క్రెడిట్ కార్డు ఖాతా మంచి స్థితిలో ఉంటుంది.

  • క్రెడిట్ స్కోర్ సేఫ్టీ:

    సమయానికి మినిమం డ్యూ చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా పడిపోకుండా కాపాడుకోవచ్చు. అయితే ఇది కేవలం తాత్కాలిక లాభమే.


దీర్ఘకాలిక నష్టాలు:

  • వడ్డీ ఖర్చులు పెరగడం:

    కేవలం మినిమం డ్యూ చెల్లిస్తే మీరు కట్టాల్సిన బ్యాలెన్స్‌ అలాగే నిలిచిపోయి ఉంటుంది. దీనివల్ల మీ బ్యాలెన్స్ పైనే వడ్డీ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. పే చేయాల్సిన మొత్తం గణనీయంగా పెరుగుతుంది.

  • అప్పు ఆలస్యం:

    మినిమం డ్యూ మాత్రమే కడితే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. సంవత్సరాల పాటు వడ్డీ చెల్లింపులు చేయాల్సి వస్తుంది.

  • అప్పుల చట్రంలో చిక్కుకుపోతారు:

    మీరు ఎప్పుడూ మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తూ పోతే ఎంతకాలమైనా అప్పుల ఊబిలోంచి బయటికి రాలేరు. అప్పు నుండి బయటపడటం కష్టమవుతుంది.


  • క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం:

    తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్‌ను కాపాడినా ఎక్కువ కాలం బ్యాలెన్స్‌ను కొనసాగించడం, మినిమం చెల్లింపులు చేయడం వల్ల మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోపై ప్రభావం పడి క్రెడిట్ స్కోర్‌ తగ్గుతుంది.

  • క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో:

    మినిమం డ్యూ చెల్లించడం వల్ల చాలా కాలం పాటు క్రెడిట్ లిమిట్‌లో ఎక్కువ భాగం ఉపయోగించినట్లుగానే కనిపిస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది.

  • ఆర్థిక ఒత్తిడి:

    నెమ్మదిగా అప్పు తీర్చడం వల్ల అధిక వడ్డీలు నెత్తిన పడతాయి. ఒత్తిడి పెరిగి ఆర్థిక నిర్వహణ కష్టమవుతుంది.


సమస్య నుంచి బయటపడే మార్గాలు:

  • పూర్తి బ్యాలెన్స్ చెల్లించడం:

    క్రెడిట్ కార్డ్ బిల్లును ప్రతి నెలా పూర్తిగా చెల్లించడం వల్ల వడ్డీ ఖర్చులను నివారించవచ్చు. మంచి క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవచ్చు.

  • మినిమం కంటే ఎక్కువ చెల్లించడం:

    పూర్తి బ్యాలెన్స్ చెల్లించలేకపోతే మినిమం కంటే ఎక్కువ మొత్తం కట్టడానికి ప్రయత్నించండి. అప్పు తీర్చే సమయంతో పాటు వడ్డీ ఖర్చులూ తగ్గుతాయి.

  • డెట్ మేనేజ్‌మెంట్ ప్లాన్:

    క్రెడిట్ కార్డ్ అప్పును నిర్వహించడం కష్టంగా ఉంటే క్రెడిట్ కౌన్సెలింగ్ ఏజెన్సీ లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. మీ క్రెడిట్ కార్డ్‌ను స్మార్ట్‌గా ఉపయోగించి ఆర్థిక స్వేచ్ఛను అందిపుచ్చుకోండి. భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.


Read Also: Stock Markets Closing : నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

తగ్గిన రెపో రేటు.. మీకు ఎంత డబ్బు సేవ్ అవుతుందో తెలుసా..

కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు..

Updated Date - Apr 09 , 2025 | 06:17 PM