Cell Phone: విద్యార్థిని ప్రాణంతీసిన సెల్‌ఫోన్.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:26 PM
సెల్‌ఫోన్ ఓ విద్యార్థిని ప్రాణంతీసింది. ఎక్కడో దూరంగా వేరే రాష్ట్రంలో ఉన్న తన తండ్రితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆదమరిచి డాబాపై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

-సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ మిద్దెపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి
చెన్నై: సెల్‌ఫోన్‌లో తండ్రితో మాట్లాడుతున్న విద్యార్థిని హఠాత్తుగా మిద్దెపై నుంచి జారిపడి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. తిరునల్వేలి జిల్లా మేలూరు సమీపంలోని మానూరులోని ఓ కళాశాలలో చదువుతున్న కలైసెల్వి తల్లిదండ్రులు గుజరాత్(Gujarath)లో వ్యాపారం చేస్తున్నారు. కలైసెల్వి అవ్వ ఇంట్లో ఉంటోంది. ఈ నెల 1వ తేది ఇంటి మిద్దెపై సెల్‌ఫోన్(Cell Phone)లో తండ్రితో మాట్లాడుతున్న కలైసెల్వి హఠాత్తుగా కాలుజారి కిందపడింది.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
తీవ్రంగా గాయపడిన ఆమెను చుట్టుపక్కల వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తుండగానే మృతిచెందింది. తల్లిదండ్రుల అనుమతితో కలైసెల్వి అవయవాలు దానంగా తీసుకున్న వైద్యులు, ఆమె మృతదేహానికి ప్రభుత్వం తరఫున నివాళులర్పించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News

ఇన్స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. చివరకు ఏమైందంటే..

అయ్యో అనుప్రియ.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

హల్వా వ్యాపారి కుటుంబంలో వరకట్నం వేధింపులు

పెళ్లిలో వివాదం.. పారిపోతూ బావిలో పడి టీనేజర్ మృతి

దళిత యువకుడిపై దారుణం.. ఇష్టారీతిన కొట్టి ఆపై..
