ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: 23 మంది సైబర్‌ క్రిమినల్స్‌ అరెస్ట్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 07:13 AM

దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతూ.. వందలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) ఆటకట్టించారు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.

- అంతర్రాష్ట్ర క్రిమినల్స్‌ కోసం 5 రాష్ట్రాలు.. 5 బృందాలతో పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌

- క్రిమినల్స్‌పై సిటీలో -14, రాష్ట్రంలో 30 కేసులు

- దేశంలో 328 కేసులు నమోదైనట్లు నిర్ధారణ

- రూ. 1.90 కోట్లు కొట్టేసిన మహిళా కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే

- ఆమెను విడిపించడానికి రంగంలోకి 10మంది లాయర్లు

- మరో కేసులో డిజిటల్‌ అరెస్టు పేరుతో రూ. 34 లక్షలు లూటీ

హైదరాబాద్‌ సిటీ: దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతూ.. వందలాది మందిని మోసం చేసి రూ. కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ క్రిమినల్స్‌(Cyber ​​criminals) ఆటకట్టించారు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడి, సుమారు నెలరోజులపాటు కష్టపడి.. 5 రాష్ట్రాల్లో గాలించి 23 మంది ఘరానా అంతర్రాష్ట్ర క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. వారిపై నగరంలో 14, తెలంగాణ వ్యాప్తంగా 30, దేశవ్యాప్తంగా 359 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతూ అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌(Uttar Pradesh, Gujarat, Maharashtra, Karnataka, Andhra Pradesh) రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Kite Festival: 13 నుంచి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌


ఈ సైబర్‌ క్రిమినల్స్‌ తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం రూ.5.29కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కొల్లగొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి 40వేల నగదు, 25 మొబైల్స్‌, 45 సిమ్‌ కార్డులు, 28 బ్యాంకు చెక్‌ బుక్‌లు, 23 డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులు, ల్యాప్‌టాప్‌, 3 క్యూఆర్‌ కోడ్‌ స్కానర్స్‌, 5 షెల్‌ కంపెనీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శివమారుతితో కలిసి డీసీపీ ధార కవిత శుక్రవారం వివరాలు వెల్లడించారు.


ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చడానికి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 ఏళ్ల కమలేష్‌ కుమారి యూపీలో ఒక ప్రధాన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ప్రచారానికి చేసిన అప్పులు తీర్చడానికి సైబర్‌ నేరగాళ్లతో చేతులు కలిపి మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో డిసెంబరు 12, 2024న నగరానికి చెందిన 70 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి ఏపీకే ఫైల్‌ రాగా ఆయన క్లిక్‌ చేశారు. ఫోన్‌ను సైబర్‌ క్రిమినల్స్‌ హ్యాక్‌ చేశారు. బాధితుడి ఖాతా నుంచి దశలవారీగా రూ. 1.90 కోట్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ డబ్బంతా ఓ ఎన్జీవోకు కరెంట్‌ ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ ఖాతాను ఫ్రీజ్‌ చేసి డబ్బు మొత్తం నిలిపివేశారు. ప్రత్యేక టీమ్‌ యూపీకి వెళ్లి నిందితులను అరెస్టు చేసింది.


రంగంలోకి 10మంది లాయర్లు

నిందితురాలు కమలేష్‌ కుమారిని రక్షించడానికి పదిమంది లాయర్లు రంగంలోకి దిగారు. నిందితురాలిని హైదరాబాద్‌ తీసుకురాకుండా, ట్రాన్సిట్‌ వారెంట్‌ ఇవ్వకుండా తెలంగాణ పోలీసులతో కోర్టులోనే తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. ఆమె డబ్బు ఎలా కాజేసింది పోలీసులు వివరించగా.. న్యాయస్థానం ఏకీభవించి నిందితురాలిని అరెస్టు చేసేందుకు, హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు టాన్సిట్‌ వారెంట్‌ జారీ చేసింది. యూపీ అడ్వొకేట్లు హైదరాబాద్‌కు రిమాండ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితురాలికి రిమాండ్‌ విధించింది.


8 రోజులు డిజిటల్‌ అరెస్ట్‌

ముంబై క్రైమ్‌ పోలీసులమంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేసిన సైబర్‌ సైబర్‌ నేరగాళ్లు 8 రోజులు డిజిటల్‌ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి రూ. 34లక్షలు కాజేశారు. డీహెచ్‌ కొరియర్‌లో మీ పేరుతో డ్రగ్స్‌,చట్ట వ్యతిరేకమైన ఉత్పత్తులు పంపుతున్నట్లు పార్శిల్‌ దొరికిందని భయపెట్టారు. స్కైప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి వీడియోకాల్‌లో ముంబై క్రైమ్‌ పోలీసుల్లా నమ్మించారు. 8 రోజులపాటు డిజిటల్‌ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.


కేసు నుంచి బయటపడాలంటే మీ ఖాతాలో ఉన్న డబ్బు ఆర్‌బీఐ ఖాతాకు బదిలీ చేయాలని, అక్రమ లావాదేవీలు జరగలేదని, డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు లేవని తేలితే డబ్బును మీ ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మించారు. బాధితుడికి వివిధ ఖాతాల్లో ఉన్న రూ. 34లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక టీమ్‌ గుజరాత్‌కు చెందిన బరియా సంజీవ్‌కుమార్‌, ఖాళీ రోహిత్‌కుమార్‌ను అరెస్టు చేసింది. వీరు దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు.


ట్రేడింగ్‌లో లాభాలంటూ రూ. 2.95కోట్లు మోసం..

ట్రేడింగ్‌లో లాభాలంటూ.. వాట్సాప్‌ గ్రూపుల్లో చేరుస్తూ దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి రూ.2.95 కోట్లు కొల్లగొట్టిన కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు క్రిమినల్స్‌ సమీర్‌ హందేకర్‌, దీపక్‌ సంపత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితుడిని మార్వల్‌ క్యాపిటా అనే స్టాక్‌ మార్కెట్‌ వాట్సాప్‌ గ్రూపులో చేర్చిన సైబర్‌ క్రిమినల్స్‌.. ట్రేడింగ్‌లో అధిక లాభాలు వచ్చినట్లు చూపించి స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించేవారు. అధిక లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించేవారు.


విడతలవారీగా రూ.2,95,15,510 పెట్టుబడులు పెట్టించారు. వాటిని విత్‌డ్రా చేసే అవకాశం కల్పించకుండా మొత్తం డబ్బును కొట్టేసి, కాంటాక్టు కట్‌ చేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రితేష్‌ సోని దుబాయ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నిందితులు 5 శాతం కమిషన్‌కు షెల్‌ కంపెనీల పేరుతో కరెంట్‌ ఖాతాలు ఇస్తున్నట్లు తేలింది.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 07:13 AM