ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: ఆ ఖాతాల్లోనే ‘సైబర్’ సొమ్ము

ABN, Publish Date - Jan 04 , 2025 | 09:44 AM

సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్‌డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు.

- నేరగాళ్లు ఉపయోగించేది ప్రైవేటు బ్యాంకులనే

- 62 శాతం లావాదేవీలు వాటిలోనే

- నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం

- కరెంట్‌ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం

- అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber ​​criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా మారాయి. వారు ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఖాతాలనే వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 62 శాతం లావాదేవీలు వాటిలోనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బ్యాంకర్లపై కూడా నిఘా పెట్టారు. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్‌డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals)కు బ్యాంకు ఖాతాల అవసరం పెరిగింది. ఈ అవకాశాన్ని బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కవుతున్నారు. నిబంధనలకు పాతరేసి నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నిషేధం ఉన్నా.. చైనా మాంజా అమ్మకాలు


కేవైసీ ఖాతాలకు డిమాండ్‌

కేవైసీ పూర్తి చేసిన ఖాతాలనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) పోటీపడుతున్నారు. రూ.50 వేల వరకు చెల్లించి అలాంటి ఖాతాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఖాతాలను గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా వెంటనే వాడుకునే అవకాశం ఉండటంతో సైబర్‌ నేరగాళ్లకు అవి వరంగా మారుతున్నాయి. అలాంటి ఖాతాలకు సంబంధించి కేసులు నమోదైనా నేరగాళ్ల పేర్లు బయటకు రావు. కరెంట్‌ ఖాతాల జారీలో బ్యాంకు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసు అధికారులు, సైబర్‌ నిపుణులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.


నేరాల అడ్డుకట్టకు బ్యాంకింగ్‌ కీలకం

బ్యాంకింగ్‌ అధికారులు కరెంట్‌ ఖాతాల నిర్వహణ, లావాదేవీలపై నిఘా పెడితే సైబర్‌ మోసాలకు వినియోగించే ఖాతాలను సులభంగా గుర్తించవచ్చని తెలుస్తోంది. టార్గెట్‌ రీచ్‌ కావాలని కొందరు, కమీషన్ల కోసం కొందరు నేరగాళ్లకు ఖాతాలను సమకూర్చుతున్నారు. బ్యాంక్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి పలు సైబర్‌ మోసాలను అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈనేపథ్యంలో బ్యాకింగ్‌ అధికారులకు సైబర్‌ నేరాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు పరస్పర సహకారం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు.


బ్యాంకర్లపై నిఘా..

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయేందుకు బ్యాంక్‌ ఖాతాలు ప్రధానం అని గుర్తించిన పోలీసులు.. ఖాతాలను అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు తాము కాజేసిన డబ్బును పలు ఖాతాలకు మార్చుతారు. కరెంట్‌ అకౌంట్‌లు ఇచ్చే సమయంలో సరైన మార్గదర్శకాలు పాటించకుండా, వెరిఫికేషన్‌ చేయకుండా కొందరు అధికారులు సైబర్‌ నేరగాళ్లకు పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పలు సైబర్‌ నేరాల దర్యాప్తులో భాగంగా సైబర్‌ నేరగాళ్లకు ఖాతాలు సమకూర్చి సహకరిస్తున్న యాక్సిస్‌ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మేనేజర్‌లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేశారు.


ప్రైవేటు బ్యాంకుల్లోనే..

సైబర్‌ మోసానికి సంబంధించి లావాదేవీలు నిర్వహించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకు ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలు వినియోగిస్తున్నారు. ఈ ఐదు బ్యాంకుల ద్వారానే సైబర్‌ నేరాల్లో కాజేసిన మొత్తంలో 62 శాతం లావాదేవీలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. కొందరు బ్యాంకు అధికారుల అవినీతితోపాటు, ఖాతాల సంఖ్య, లావాదేవీలు పెంచుకోవడానికి కూడా పలు బ్యాంకులు ఇలాంటి ఖాతాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


వారికి ఈ మూడే కీలకం

సైబర్‌ నేరగాళ్లకు ప్రజలకు చెందిన సమాచారం(ఫోన్‌ నెంబర్లు), సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు కీలకం. అవి లేకుండా వారు మోసం చేయలేరు. దేశంలో డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ సరైన రీతిలో అమలు కాకపోవడంతో ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం నేరగాళ్ల చేతికి చేరుతోంది. ఒడిశా, వెస్ట్‌బెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి సిమ్‌కార్డులు కొనుగోలు చేస్తున్నారు. చిన్న మొత్తాలకు కక్కుర్తిపడే ఏజెంట్లు, యూజర్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తున్న టెలికాం కంపెనీల ఆధిపత్యపోరు కారణంగా నేరగాళ్లకు సిమ్‌కార్డులు ఈజీగా లభిస్తున్నాయి. కమీషన్లు ఇచ్చి కొన్ని బ్యాంకు ఖాతాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 09:44 AM