Share News

Hyderabad: అప్పు తిరిగివ్వమంటే హత్య చేశాడు..

ABN , Publish Date - Jan 11 , 2025 | 08:22 AM

తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినందుకు స్నేహితుడినే గొంతుపిసికి చంపాడో పాత నేరస్థుడు. తాను తాకట్టు పెట్టిన కారును దొంగలించడానికి రాగా ఆ పాత నేరస్థుడిని పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Hyderabad: అప్పు తిరిగివ్వమంటే హత్య చేశాడు..

హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినందుకు స్నేహితుడినే గొంతుపిసికి చంపాడో పాత నేరస్థుడు. తాను తాకట్టు పెట్టిన కారును దొంగలించడానికి రాగా ఆ పాత నేరస్థుడిని పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.91, 500 నగదు, బంగారు ఆభరణాలు, 5 సెల్‌ ఫోన్లు, కారు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాకు చెందిన రమేష్‌(32) హోటల్‌ రూమ్‌ సర్వీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Gajjela Kantam: కేటీఆర్‌ తీహార్‌ జైలుకు వెళ్లక తప్పదు..


2013లో ఓ వ్యక్తిని హత్య చేసి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌, వాహనం దోచుకెళ్లాడు. అరెస్టై బెయిల్‌పై విడుదలైన తర్వాత నగరానికి వచ్చాడు. రియల్‌ ఎస్టేట్‌(Real estate) కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కిరాణా షాప్‌ నడుపుతున్న ఎల్లారెడ్డిగూడ(Yellareddyguda)కు చెందిన విష్ణురూపని(45)పరిచయం అయ్యాడు.

city5.2.jpg


రమేష్‌ తన కారును విష్ణు వద్ద తనఖా పెట్టి రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించక పోగా కారును తిరిగి ఇవ్వమని రూపాని కోరాడు. దీనికి విష్ణు నిరాకరించడంతో అమీర్‌పేట(Ameerpet)లోని తన గదికి పిలిచి హత్యకు పాల్పడ్డాడు. విష్ణు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 08:23 AM