Share News

Hyderabad: రేటింగ్స్‌, రివ్యూలకు రోజుకు రూ.8 వేలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:49 AM

నగరంలో.. సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతారోజూ ఎక్కడో ఒకచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఈ సైబర్ మోసాని బలైంది. మొత్తం 1.35 లక్షలు పోగోట్టుకుంది.

Hyderabad: రేటింగ్స్‌, రివ్యూలకు రోజుకు రూ.8 వేలు

- సైబర్‌ నేరగాళ్ల ప్రచారం

- నిజమని నమ్మి రూ.1.35 లక్షలు మోసపోయిన మహిళ

హైదరాబాద్‌ సిటీ: ఇంటి నుంచే పనిచేసి కొన్ని సంస్థలకు రేటింగ్స్‌, రివ్యూలు ఇవ్వడం ద్వారా రోజుకు రూ.2వేల నుంచి 8 వేల వరకు సంపాదించుకోవచ్చు అని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) మహిళ నుంచి రూ.1.35 లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన 33 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌ మెసేజ్‌(WhatsApp message) వచ్చింది. ‘ఐహెచ్‌సీఎల్‌ కంపెనీలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగం రెడీగా ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇంట్లో అక్కాచెల్లెళ్ల మృతదేహాలు..


గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా మేం చెప్పిన 10-15 రెస్టారెంట్లకు రేటింగ్స్‌ ఇవ్వడం, రివ్వ్యూలు రాయడం, వాటిని స్ర్కీన్‌ షాట్స్‌ తీసి పోస్టు చేయడం చేస్తే చాలు. రోజుకు రూ.2వేల నుంచి 8 వేలు సంపాదించొచ్చు’ అని ఆ మెసేజ్‌ సారాంశం. అదంతా నిజమని నమ్మిన మహిళ వారు చెప్పిన విధంగా టాస్క్‌లు పూర్తి చేసి పంపగానే ప్రారంభంలో కొంత నగదును ఖాతాలో జమ చేశారు. అనంతరం ‘మీరు మన కంపెనీలోనే చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయి’ అని ఆశ చూపించారు.


city4.3.jpg

వీఐపీ పేరుతో ఉన్న గ్రూపులో యాడ్‌ చేశారు. లాభాలు పొందిన వారు అంటూ పోస్టులు, స్ర్కీన్‌షాట్స్‌ ఆ గ్రూపులో షేర్‌ చేసేవారు. అదంతా నిజమని నమ్మిన బాధితురాలు వారు సూచించిన ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ చేసింది. ప్రారంభంలో తక్కువ మొత్తానికే మంచి లాభాలు వచ్చినట్లు చూపించారు. మెల్లగా ఊబిలోకి దింపి రూ.1.35 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత కాంటాక్టులు కట్‌ చేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 09:49 AM