Hyderabad: దారుణం.. పెళ్లిపత్రికలు పంచేందుకు వెళ్తుండగా హత్య
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:14 AM
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లిపత్రికలు పంచేందుకు వెళ్తున్న అతడిని దారుణం నరికి చంపారు. దీంతో అక్కడ భయానక వాతావణం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

- మూడు రోజుల్లో పెళ్లి
- మృతిచెందిన వ్యక్తి రౌడీషీటర్
హైదరాబాద్: మూడు రోజుల్లో పెళ్లి. బంధువులు, స్నేహితులకు పత్రికలు పంచేందుకు ఆదివారం రాత్రి డబీర్‌పురా వెళ్లాడు. బైకుపై వచ్చిన కొందరు దుండగులు అతడిని దారుణ హత్య చేశారు. రెయిన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌నాయక్(Rain Bazaar Inspector Ramesh Nayak), మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్‌నుమా ఫాతిమా నగర్(Falaknuma Fatima Nagar)కు చెందిన మహ్మద్ గయాసుద్దీన్ కుమారుడు మహ్మద్ మసీయుద్దీన్ అలియాస్ మసి(27)పై ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: నమ్మించి నట్టేట ముంచారు
ప్రస్తుతం పత్తర్‌ఘట్టీలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. షాప్ పెట్టినప్పటి నుంచి సమీపంలోని ఓ వ్యాపారితో గొడవ జరుగుతోంది. మార్చి 23న చిన్న గొడవ జరగగా, పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. ప్రస్తుతం నేరాలకు దూరంగా ఉంటున్న మసీయుద్దీన్‌కు కుటుంబసభ్యులు సంబంధం చూసి ఎంగేజ్‌మెంట్ జరిపించారు. ఈనెల 17న మలక్‌పేట్‌లోని ఆఫీసర్స్ మెస్‌లో పెళ్లి, 19న చంపాపేట్‌లోని ఫంక్షన్ హాల్‌లో రిసెప్షన్ నిర్ణయించారు. ఆదివారం రాత్రి మసీయుద్దీన్ పెళ్లి పత్రికలు తీసుకొని డబీర్‌పురాలోని బంధువులు, స్నేహితులకు ఇవ్వడానికి వెళ్లాడు.
రాత్రి 1.15 గంటల సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు వ్యక్తులు మసీయుద్దీన్‌పై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు, స్థానికులు రెయిన్ బజార్ పోలీసులు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేసరికి మసీయుద్దీన్ మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య కేసును చేధించడానికి పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
‘మసీయుద్దీన్ ప్రస్తుతం నేరాలకు దూరంగా ఉంటున్నాడు. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉండగా చంపేశారు. హత్య కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు, కఠినంగా శిక్షించాలి.’ అని మసీయుద్దీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
Read Latest Telangana News and National News