Share News

Preeti Kushwaha: ఇదేం ప్రేమరా సామి.. ప్రియురాలిని అన్యాయంగా చంపేశావుగా..

ABN , Publish Date - Apr 03 , 2025 | 05:40 PM

Preeti Kushwaha: ప్రేమ, పెళ్లి బంధాలలో అనుమానం ఓ రాక్షసిలాంటిది. ఎదుటి వ్యక్తిని క్షోభకు గురి చేసి ప్రాణాలు తీసే పెను భూతం అది. సీక్రెట్ భర్త అనుమానానికి ప్రీతి అనే యువతి ప్రాణాలు తీసుకుంది. అతడి కోసం ఎంత చేసినా మారకపోవటంతో చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Preeti Kushwaha: ఇదేం ప్రేమరా సామి.. ప్రియురాలిని అన్యాయంగా చంపేశావుగా..
Preeti Kushwaha

ప్రేమలో పొసెసివ్‌నెస్ ఉండటం అన్నది మంచిదే.. అయితే.. మన పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నామా? అవతలి వాళ్లను అనుమానిస్తున్నామా? అన్నదానిపై రిలేషన్ ఆధారపడి ఉంటుంది. మగ కావచ్చు.. ఆడ కావచ్చు... ఈ సృష్టిలోని ఏ జీవికైనా స్వేచ్ఛ అన్నది అత్యంత ముఖ్యమైన అవసరం.. దానికి ఆటంకం కలిగిస్తే ఏ జీవి ప్రశాంతంగా జీవించలేదు. మరీ ముఖ్యంగా రిలేషన్‌లో ఉన్నపుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు.. కానీ, అపార్థం మాత్రం చేసుకోకూడదు. వాళ్లు తప్పు చేస్తున్నారో.. లేదో తెలియకుండా దూరం పెడితే.. బాధతో కుమిలిపోయే మనసు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడదు. ప్రీతి కూశ్వాహ కూడా అదే చేసింది. ప్రియుడు అలియాస్ బావ అలియాస్ భర్త దూరం పెడుతున్నాడని ప్రాణం తీసుకుంది.


ప్రీతి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండు సంవత్సరాల క్రితం ఆమె తమ సొంతవూరుకు.. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వెళ్లింది. అక్కడ బావ వరుస అయ్యే వ్యక్తిని కలిసింది. వారి పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. కొంత కాలం ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇరుకుటుంబాల వారికి చెప్పలేదు. ఇద్దరూ సీక్రెట్‌గా కలుస్తూ ఉండేవారు. వీరి రిలేషన్ కొంతకాలం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. ప్రీతి భర్త ఆమెను మెల్లమెల్లగా టార్చర్ చేయటం మొదలెట్టాడు. ‘ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేను ఏం చేయాలి?’ అంటూ వేధించేవాడు.


దీంతో ప్రీతి కృంగిపోయింది. బావకు తప్ప మిగిలిన మగాళ్లకు అందంగా కనిపించకూడదన్న ఉద్దేశ్యంతో ఇంట్లో వాళ్లతో గొడవపడి మరి గుండు చేయించుకుంది. అయినా అతడిలో మార్పు రాలేదు. ప్రీతితో బంధం తెంచుకున్నాడు. ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు. ఈ కారణాలతో ప్రీతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. చనిపోయే ముందు పిజ్జా ఆర్డర్, కూల్ డ్రింక్ ఆర్డర్ చేసుకుని తిని, తాగింది. తర్వాత గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటికి వచ్చిన తల్లి కూతుర్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. ప్రీతి మరణం తర్వాత ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. భర్త కారణంగానే ఆమె చనిపోయినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..

Updated Date - Apr 03 , 2025 | 05:43 PM