Share News

Ayodhya Ram Navami: అయోధ్యలో అద్భుతం.. శ్రీరాముడికి సూర్య తిలకం..

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:53 PM

శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భతం ఆవిష్క్రుతమైంది. సూర్యకిరణాలు నేరుగా బాల రాముడి నుదుటిపై పడడాన్ని తిలకించిన భక్తలు పులకించిపోయారు.

Ayodhya Ram Navami: అయోధ్యలో అద్భుతం.. శ్రీరాముడికి సూర్య తిలకం..

శ్రీరామ నవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరంలో అద్భతం ఆవిష్క్రుతమైంది. సూర్యకిరణాలు నేరుగా బాల రాముడి నుదుటిపై పడడాన్ని తిలకించిన భక్తలు పులకించిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో (Ayodhya Ram Mandir) ఆదివారం అద్భుత ఘట్టం ఆవిష్క్రతమైంది. బాలరాముడి నుదుటిపై నుదిటిపై సూర్యకిరణాలు పడిన అద్భుత ఘట్టాన్ని తిలకిందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 5 నిముషాల పాటు సూర్యకిరణాలు స్వామి నుదిటిపై పడ్డాయి. మరోవైపు పండుగ సందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బాలరాముడి ఆలయం నిర్మించే సమయంలోనే తగిన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.


అయోధ్య రామాలయాన్ని నిర్మించే సమయంలో ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ట్రస్టు సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాముడి పుట్టినరోజున సూర్య కిరణాలు నుదిటిపై ప్రసరించేలా ఏర్పాట్లు చేయించారు. కటకాలతో సూర్యకిరణాలను పరావర్తానం చెందించేందుకు సీబీఆర్‌ఐ అధికారులు బెంగళూరులోని ఆస్ట్రోఫిజిక్స్‌ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. ఆలయ కిటికీల ద్వారా సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూర్యకిరణాలు శ్రీరాముడి నుదిటిపై సుమారు ఐదు నిముషాల పాటు ఉండేలా ప్రత్యేకంగా పైపులు, అద్దాలు, లెన్స్‌లతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.

Updated Date - Apr 06 , 2025 | 12:53 PM