ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VETLS Scheme : ఈ స్కీం కింద ప్రతి విద్యార్థికి రూ.4 లక్షలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా..

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:59 PM

VETLS Scheme 2025 : విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఒకటే వీఈటీఎల్‌ఎస్ స్కీం. ఈ పథకం కింద దక్కే సాయంతో ఏ విద్యార్థి అయినా నిర్భయంగా పై చదువులు చదువుకోవచ్చు. మరి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి.. అర్హత, ఆర్థిక సాయం ఎలా పొందాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Central Scheme VETLS For Students

Apply Vocational Education and Training Loan Scheme (VETLS) : యువత నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తోంది. వాటిల్లో ఒకటే వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీం. ఈ పథకం కింద వచ్చే డబ్బును విద్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ లేదా ట్రైనింగ్ కోర్సు కోసం వినియోగించుకోవచ్చు. అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, పరీక్షల ఫీజు, లైబ్రరీ ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరికరాల కొనుగోలుకు, ఇన్‌స్ట్రుమెంట్స్, బోర్డింగ్, లాడ్జింగ్ వంటి అనేక అవసరాల కోసం ఈ స్కీం కింద వచ్చే రుణసాయాన్ని వాడుకోవచ్చు.


2 ఏళ్లలో రూ.4లక్షల ఆర్థిక సాయం..

వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్కీంలో లోన్ డబ్బును విద్యార్థి అవసరాలకు అనుగుణంగా మంజూరు చేస్తారు. వీరు అందించే కోర్సుల వ్యవధి దాదాపు 2 ఏళ్లు. ఈ సమయంలో విద్యార్థికి అయ్యే 90శాతం ఖర్చులను ఈ స్కీం కింద అందుకోవచ్చు. కోర్సు పూర్తయ్యేసరికలా ప్రతి విద్యార్థికి రూ.4లక్షల వరకూ ఆర్థిక సాయం దక్కుతుంది. ఇంతకంటే ఎక్కువ ఖర్చయితే అది సదరు విద్యార్థే పెట్టుకోవాల్సి ఉంటుంది.


ఇలా దరఖాస్తు చేసుకోవాలి :

  • అర్హతలు : 18-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు గుర్తింపు పొందిన కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రుణం పొందే విద్యార్థి తప్పనిసరిగా ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC) గ్రూపుకి చెందిన వ్యక్తి అయివుండాలి.

  • కోర్సు ఎంపిక : ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్‌మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) లేదా స్టేట్ స్కిల్ మిషన్‌లు/స్టేట్ స్కిల్ కార్పొరేషన్‌లకు చెందిన కంపెనీ, సొసైటీ లేదా ఆర్గనైజేషన్ వంటి గుర్తింపు పొందిన సంస్థల్లో వృత్తి విద్య లేదా శిక్షణ కోర్సును ఎంచుకోవాలి. అడ్మిషన్ సర్టిఫికేట్ రుజువు తప్పక తీసుకోవాలి.


  • రుణం కోసం దరఖాస్తు : నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NBCFDC) లేదా నేషనల్ సఫాయ్ కర్మచారిస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • కావాల్సిన పత్రాలు : కోర్సు అడ్మిషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆదాయ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం తప్పక జత చేయండి. రుణం ఆమోదం పొందేవరకూ వేచి ఉండండి. దీనికి కొంత సమయం పట్టవచ్చు.


VETLS 2025 పథకం వివరాలు :

లోన్ మొత్తం : ఒక సంవత్సరం కంటే ఎక్కువ లేదా రెండు సంవత్సరాల వరకు వ్యవధి ఉన్న కోర్సులకు ₹1,50,000 వరకూ.

వడ్డీ రేటు : వడ్డీ సంవత్సరానికి 4%. మహిళలకు 0.5% వడ్డీ రాయితీ ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకం కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు NBCFDC లేదా NSKFDC పై క్లిక్ చేయండి.


Read Also : తెలుగుతెరపై మహా శివుళ్ళు

ఏంటీ.. ఆ వాయిస్ తెలుగమ్మాయిదా.. వీడియో వైరల్..

ఇందువల్లే.. చిన్న వయసులో హార్ట్ ఎటాక్..

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 06:13 PM