Health Tips: పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 సూపర్ ఫుడ్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:27 PM
సూపర్‌ఫుడ్‌లు అనేవి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు. ఇవి మీ ఆహారంలోని మైక్రోబయోమ్‌ను తిరిగి నింపుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తాయి. అయితే, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పేగు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు: మన శరీరంలోని ప్రతి అవయవం మనకు విలువైనదే. మన మొత్తం ఆరోగ్యంలో పేగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లక్షలాది సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది. వీటిని సమిష్టిగా గట్ మైక్రోబయోమ్ అని పిలుస్తారు. ఈ సూక్ష్మజీవులు సరైన జీర్ణక్రియ, పోషకాల శోషణ, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే మీ ఆహారం, ఈ సూక్ష్మజీవుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోవడం వల్ల మీ ప్రేగులలోని మంచి, చెడు బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
సూపర్ ఫుడ్స్ అంటే ఏమిటి?
సూపర్‌ఫుడ్‌లు అనేవి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, ఇవి మీ ఆహారంలోని మైక్రోబయోమ్‌ను తిరిగి నింపుతాయి. జీర్ణక్రియను పెంచుతాయి. అయితే, వేటిల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? ఎలాంటి సూపర్ ఫుడ్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు
పెరుగు పేగు ఆరోగ్యానికి మంచిది. దీన్ని పండ్లతో కలిపి సాదాగా తినవచ్చు లేదా మజ్జిగగా చేసి తాగవచ్చు. పెరుగును జీర్ణక్రియ, శీతలీకరణ, ప్రోబయోటిక్ ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. మజ్జిగ ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఇది పేగు ఆరోగ్యంగా ఉండేలా అద్భుతాలు చేస్తుంది.
మూంగ్ దాల్
మూంగ్ దాల్ మీ వంటగదిలో సులభంగా లభించే మరో సూపర్ ఫుడ్. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. మీ పేగులకు అనుకూలమైన బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి మొలకలు, కిచిడి, పప్పు వంటి వంటకాల్లో ఈ మూంగ్ దాల్ ను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పులియబెట్టిన ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పేగు ఆరోగ్యం కోసం అల్పాహారంగా ఇడ్లీ, దోసె తినవచ్చని నిపుణులు చెబుతున్నారు
ఉసిరి
ఉసిరి పండు సహజంగా జీర్ణవ్యవస్థ బూస్టర్. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి.
నెయ్యి
నెయ్యి పేగు పొరను పోషించడంతో పాటు జీర్ణక్రియకు సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పేగులకు సరైన పోషణను అందించడానికి మీరు ఒక చెంచా నెయ్యిని గంజి, అన్నం లేదా పప్పుతో కలపి తీసుకోచ్చు.
(NOTE: పై సమాచారం నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
Cucumber Diet Mistakes: వేసవిలో దోసకాయను ఈ పదార్థాలతో కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు..
Silver Benefits : చిన్న పిల్లలకు వెండి ఆభరణాలు ఎందుకు ధరిస్తారో తెలుసా..
UPI Services Down : సర్వర్ డౌన్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్లు..