Share News

Diabetes Tips: షుగర్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చా.. తాగకూడదా..

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:23 PM

Diabetes Solutions: వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువ. ఈ సమస్య రాకుండా ఉండేందుకు నీరు, పండ్ల రసాలు ఇలా నిత్యం ఏదొకటి తాగుతూ ఉండాలి. మరి, డయాబెటిస్ పేషెంట్లు అందరిలాగా చెరకు రసం తాగొచ్చా.. తాగితే ఏమవుతుంది.. డైటీషియన్లు ఏమంటున్నారు..

Diabetes Tips: షుగర్ పేషెంట్లు చెరకు రసం తాగొచ్చా.. తాగకూడదా..
Sugarcane Juice

Diabetes Solutions: మండే ఎండల్లో చల్లచల్లని డ్రింక్స్ తాగాలని ఎవరికి మాత్రం అనిపించదు. అందుకోసం ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఇలా ఏదొకటి తీసుకుంటూ ఉంటారు. కూల్ డ్రింక్స్‌ వద్దనుకునే ఎక్కువగా ప్రిఫర్ చేసేది చెరకు రసం. అయితే, అందరిలా కాకుండా డయాబెటిస్ పేషెంట్లు మాత్రం ఏది తాగాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందే. సాధారణంగా చెరకులో సహజ చక్కెరలు షుగర్ పేషెంట్లకు మంచిదే అని చెప్తుంటారు. అయినప్పటికీ, చెరకు రసం తాగాలా? వద్దా? అనే సందేహం డయాబెటిస్ ఉన్నవారిని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఇంతకీ, ఈ విషయమై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..


వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం ద్వారా శరీరాన్ని హెడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మండే ఎండల్లో చెరకు రసం ది బెస్ట్ ఆప్షన్ అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.శరీరానికి తక్షణ శక్తిని ప్రసాదించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, మెరుగైన జీర్ణక్రియకు, హీట్ స్ట్రోక్ నివారించేందుకు ఇది సాయడుతుంది. మరి, మధుమేహ వ్యాధిగ్రస్తులు సహజ చక్కెరలు ఉన్న చెరకు రసం తాగవచ్చా? చెరకు రసం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగిపోతాయా? లేదా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


చెరకు రసం ప్రయోజనాలు..

చెరకు రసంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది కాకుండా ఇందులో నీరు, ఫైబర్ సహా అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఈ రసంలో ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. ఇవికాక ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.


షుగర్ ఉన్నవారు చెరకు రసం తాగితే..

చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. తీవ్రస్థాయిలో మధుమేహం ఉన్నవారు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునేవారు చెరకు రసం తీసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయి (HbA1C) 6 కంటే తక్కువగా ఉండి ఇన్సులిన్ తీసుకోని వారు చెరకు రసం తాగితే శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ లభిస్తుంది. ఇందులో డయాబెటిక్ రోగులకు అవసరమైన ఫైబర్ కూడా ఉంటుంది. ఇక సాధారణ చక్కెర స్థాయిలు ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లే తాగాలి. అది కూడా ఒక వారంలో 200 మి.లీ. మించకుండా తాగితే ఎటువంటి హాని జరగదు.


గ్లైసెమిక్ ఇండెక్స్..

డయాబెటిస్ రోగులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 55 కంటే తక్కువ ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. చెరకు రసంలో GI 43 ఉంటుంది. అందువల్ల ఇది డయాబెటిక్ రోగులకు మంచి చేసేదే. అయితే దీనిని ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.


Read Also : Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి పాటిస్తే మైండ్ షార్ప్ అవడం పక్కా..

Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..

Raw Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..

Updated Date - Mar 24 , 2025 | 04:32 PM