Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి
ABN , Publish Date - Jan 27 , 2025 | 10:40 PM
ఫ్యాటీ లివర్ తొలి నాళ్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: లివర్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకే వైద్యులు దీన్ని సైలెంట్ హీరో అని పిలుస్తుంటారు. శరీరంలో పోషకాలు గ్రహించడం, ప్రొటీన్ల తయారీ, విషతుల్యాల తొలగింపు ప్రక్రియల్లో లివర్ పాత్ర అధికం. అయితే, చాలా మంది ఫ్యాటీ లివర్‌తో సతమతమవుతుంటారు. లివర్ కణాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ఇన్‌ఫ్లమేషన్, నొప్పి, ఇతర దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ఫ్యాటీ లివర్ తొలి దశలో పెద్దగా లక్షణాలేవీ బయటపడవు (Health). అయితే, సాధారణ సమస్యలుగా మనం భావించే అనారోగ్యాలు దీర్ఘకాలం వేధిస్తున్నాయంటే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు సందేహించాలని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ లక్షణాలు ఏంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం (Fatty liver Early Symptoms).
Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తక్షణ రిలీఫ్!
ఫ్యాటీ లివర్ మొదలైనప్పుడు ఒంట్లో కొన్ని రోగ లక్షణాలు బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు.
పొట్టు చుట్టూ కొవ్వు పేరుకోవడం ఫ్యాటీ లివర్‌కు సంబంధించి తొలి నాళ్లల్లో బయటపడే ఓ ముఖ్య లక్షణం. బరువు పెరగడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్లంల్లో ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరిగి ఈ పరిస్థితి వస్తుందని వివరిస్తున్నారు.
నిరంతరం అలసిపోయినట్టు ఉండటం కూడా ఈ వ్యాధి ముఖ్య లక్షణాల్లో ఒకటి. నిరంతరం నీరసం వేధిస్తోందంటే లివర్‌లో ఏదో సమస్య ఉన్నట్టు అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇక పక్కటెముకల కింద అసౌకర్యంగా అనిపించడం కూడా ఫ్యాటీ లివర్‌కు సంకేతం. లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉందని అర్థం.
జుట్టు ఊడిపోవడం, చర్మంపై నల్లని ముడతలు ఏర్పడటం, మొటిమలు ఎక్కువగా రావడం వంటివన్నీ ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను సూచిస్తాయి. లివర్‌లో ఇబ్బంది తలెత్తినప్పుడు ఇన్సులీన్ రెసిస్టెన్స్ మొదలవుతుంది.
Weight Loss Paralysis: జిమ్ ట్రెయినర్‌కు షాక్.. 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గినందుకు పక్షవాతం!
వాంతి వస్తున్నట్టు అనిపించడం, ఆకలి మందగించడం కూడా లివర్ సమస్యను సూచిస్తాయి.
ఇక ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకునేందుకు ఔషధాలతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి
ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను పక్కనపెట్టి కూరగాయలు, పళ్లు, లీన్ మీట్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
మద్యపానం, చక్కెర, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం జోలికి వెళ్లొద్దు.
క్రమం తప్పకుండా చేసే కసరత్తులు కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తగినంత నీరు తాగితే లివర్ సమర్థవంతంగా శరీరం నుంచి విషతుల్యాలను తొలగిస్తుంది.
బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. కొద్ది పాటి బరువు తగ్గినా కూడా లివర్‌పై సానుకూల ప్రభావం రెట్టింపవుతుంది.