Share News

MRI Scan: మహిళ ప్రాణాలు తీసిన MRI స్కాన్.. వీరు జాగ్రత్తగా ఉండాలి..

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:12 PM

కొద్దిరోజుల క్రితం ఎమ్ఆర్ఐ స్కానింగ్ కారణంగా ఓ మహిళ చనిపోయింది. స్కానర్ లోపల ఉండగానే ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే.. స్కానింగ్ ఎంత వరకు సేఫ్.. స్కానింగ్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?.. ఎవరు ఎమ్ఆర్ఐ చేయించుకోవటం సురక్షితం కాదు.

MRI Scan: మహిళ ప్రాణాలు తీసిన MRI స్కాన్.. వీరు జాగ్రత్తగా ఉండాలి..
MRI SCAN

ఏదైనా సమస్య తీవ్రంగా.. ఎక్కువ కాలం నుంచి వేధిస్తుంటే.. ఎమ్ఆర్ఐ స్కాన్ తీయించుకోమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. శరీరంలో బయటకు కనిపించని సమస్యలు ఏవైనా ఉంటే అందులో బయటపడతాయి. డాక్టర్లు ఆ సమస్య తీవ్రతకు తగ్గట్టు చికిత్స అందిస్తారు. మనుషుల ప్రాణాలు కాపాడే ఎమ్ఆర్ఐ స్కాన్ల కారణంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. కొన్ని సార్లు మిషన్ తప్పుల వల్ల.. మరికొన్ని సార్లు ఎమ్ఆర్ఐ స్కాన్ చేసే సిబ్బంది తప్పుల వల్ల అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన ఓ మహిళ ఎమ్ఆర్ఐ స్కాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. స్కానింగ్ చేస్తుండగా..లోపలే ప్రాణాలు విడిచింది. ఏలూరు రూరల్ మండలం ప్రతికోళ్లంకకు చెందిన రామతులసమ్మ అనే మహిళకు గతంలో గుండెపోటు రావటంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లు పేస్ మేకర్ అమర్చారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సూచన మేరకు స్కానింగ్ కోసం వెళ్లింది. అక్కడి సిబ్బంది మెటల్ డిటెక్టర్ సాయంతో ఆమెను పరీక్షించకుండా స్కానింగ్ మిషన్‌లోకి పంపారు. రామతులసమ్మ లోపలే చనిపోయింది.


ఎమ్ఆర్ఐ స్కానింగ్ వల్ల ఎవరికి ప్రమాదం?..

సాధారణంగా ఎమ్ఆర్ఐ స్కానింగ్ అనేది చాలా సేఫ్. సాధారణ జనాలకు దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఏదైనా సమస్య కారణంగా శరీరంలో మెటల్‌ను అర్చినట్లు అయితే అలాంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఎమ్ఐఆర్ఐ స్కాన్ బలమైన అయస్కాంత శక్తితో పని చేస్తుంది. దాని వల్ల శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, శరీరంలో అమర్చిన పరికరాలు పని చేయటం మానేసే అవకాశం ఉంది. అయస్కాంత, రేడియో తరంగాల సిగ్నల్స్ కారణంగా వేడి ఉత్పత్తి అవుతుంది. లోపల ఉన్న పరికరాలను కదల్చే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగినపుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. కొన్ని సార్లు అలర్జీకి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అలర్జీ వచ్చినట్లయితే డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది.


వీరికి ఎమ్ఆర్ఐ స్కాన్ సురక్షితం కాదు..

గుండెకు సంబంధించి.. కార్డియాక్ డివైజెస్ అయిన పేస్ మేకర్, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డెఫిబ్రిలేటర్, కొన్ని రకాల న్యూరో స్టిములేటర్స్ సురక్షితం కాదు. ఇక, మెదడుకు సంబంధించి ..బ్రెయిన్ అనేయురిజమ్ క్లిప్స్, మెటల్ కాయిల్స్ లేదా రక్త నాళాల్లో అమర్చిన స్టంట్స్, మెటల్ క్లిప్స్, సర్జికల్ ప్రొసిజర్ కోసం వాడిన సుతరస్లు ఎమ్ఆర్ఐకి సురక్షితం కాదు. కొన్ని రకాల చెవి, పళ్ల ఇంప్లాంట్లు చేయించుకున్న వారికి ఎమ్ఆర్ఐ కారణంగా సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఐరన్, కోబాల్ట్, నికేల్‌తో తయారు చేసిన వస్తువులు ఎమ్ఐఆర్ఐకి సురక్షితం కాదు.


Also Read:

బంగారం కొట్టేయడానికి వీళ్లు మామూలు ప్లాన్ వేయలేదుగా..

రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్.. బీజేపీ ఆరోపణ

4 వేల మంది కస్టమర్లకు రెస్టారెంట్ పరిహారం!

For More Health News and Telugu News..

Updated Date - Mar 15 , 2025 | 04:13 PM