చాంపియన్‌కు షాకిచ్చి ఫైనల్‌కు
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:20 AM
రష్యా టెన్నిస్ సంచలనం, 17 ఏళ్ల మిర్రా ఆండ్రీవా.. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో...

ఇండియన్ వెల్స్‌లో ఆండ్రీవా జోరు
న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్ సంచలనం, 17 ఏళ్ల మిర్రా ఆండ్రీవా.. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో జోరు కొనసాగిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియటెక్ (పోలెండ్)కు షాకిచ్చి సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో 9వ సీడ్ ఆండ్రీవా 7-6 (1), 1-6, 6-3తో స్వియటెక్‌ను ఓడించి సబలెంక (బెలార్‌స)తో ఫైనల్‌ఫైట్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో 2001లో క్లియ్‌స్టర్స్ (బెల్జియం) తర్వాత ఇండియన్ వెల్స్‌లో తుదిపోరుకు చేరిన తొలి టీనేజర్‌గా ఆండ్రీవా రికార్డు సృష్టించింది.