టెస్టు కెప్టెన్‌గా రోహిత్ ఓకేనా?
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:22 AM
భారత టెస్టు జట్టు సారథిగా రోహిత్ శర్మ భవితవ్యం ఇప్పుడు కోచ్ గౌతం గంభీర్ చేతుల్లో ఉందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై...

గంభీర్ చేతిలో భవితవ్యం!
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు సారథిగా రోహిత్ శర్మ భవితవ్యం ఇప్పుడు కోచ్ గౌతం గంభీర్ చేతుల్లో ఉందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై టీమిండియా వరుసగా టెస్టు సిరీ్‌సలను కోల్పోవడంతో రోహిత్ సారథ్యంపై విమర్శలు చెలరేగాయి. అలాగే ఆటగాడిగానూ అతను విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉందని కథనాలు వినిపించాయి. కానీ వాటిని రోహిత్ తోసిపుచ్చాడు. అయితే జూన్‌లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. ఆ సిరీ్‌సకు సారథిగా ఎవరనేది బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బహుశా ఐపీఎల్ మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సిరీ్‌సకు రోహిత్‌నే కొనసాగించే చాన్సుందని సమాచారం. కానీ అంతకంటే ముందు కోచ్ గంభీర్ అభిప్రాయం కూడా తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ‘ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత్ టెస్టులు ఆడలేదు. అలాగే కెప్టెన్సీ మార్పు కూడా జరగలేదు. సాంకేతికంగా రోహితే ఇప్పటికీ టెస్టు కెప్టెన్. అయితే, రోహిత్‌ను కొనసాగించే విషయంలో గంభీర్ నిర్ణయం కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశముంది’ అని బీసీసీఐ అధికారి గుర్తుచేశాడు.
ఇవీ చదవండి:
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్
బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి