Apple For Health: ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా.. ఎంతసేపటికి తాగాలో తెలుసుకోండి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:47 PM
Drinking Water After Eating Apple: రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఎప్పటికీ రాదని ఒక సామెత ఉంది. ఒక్క ఆపిల్ పండు వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయో దీన్ని బట్టే అర్థమవుతుంది. కానీ, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే చాలా ప్రమాదం. మరి, ఎంత సమయం తర్వాత తాగితే మంచిదో తెలుసుకోండి.

When To Drink Water After Eating Apple: ఆరోగ్య నిపుణులు తరచుగా ఆపిల్ తినాలని సిఫార్సు చేస్తారు. ఆపిల్ తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి భారీగా పెరుగుతుంది. అందువల్ల ఏ వ్యాధులు అంత ఈజీగా మిమ్మల్ని టచ్ చేయలేవు. అందుకే ఎప్పుడూ అనారోగ్య సమస్యలు రాకూడదంటే ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తినడం చాలా ముఖ్యం. కానీ, ఆపిల్ వల్ల మెరుగైన ఫలితాలు పొందాలంటే సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఆపిల్ తినక ముందు గానీ, తిన్న వెంటనే గానీ నీరు తాగితే మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా?
చాలా సార్లు నీళ్లు తాగిన తర్వాత పండ్లు తినడమో లేదా పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడమో చేస్తుంటారు చాలామంది. మిగిలిన పండ్ల సంగతి ఎలా ఉన్నా.. ఆపిల్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తపడాలి. ఆపిల్‌లో ఉండే విటమిన్లు, ఫైబర్,ఖనిజాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. ఇవి తిన్నవెంటనే వేగంగా జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లు పలుచబడతాయి. జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించి కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. అలాగే ఆపిల్ తినబోయే ముందు కూడా నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు.
ఆపిల్ ఎలా తినాలి?
మీరు రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ తినవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం మానుకోవాలి. సాయంత్రం వేళల్లో ఆపిల్ తిన్నా కూడా ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి బదులుగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, అల్పాహారం తర్వాత ఆపిల్ తినవచ్చు. ఆపిల్ తిన్న కనీసం అరగంట నుంచి ఒక గంట తర్వాత నీరు తాగాలి. ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. అయితే, వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఆపిల్ తిన్న కాసేపటికే కొద్ది మోతాదులో నీళ్లు తాగొచ్చు.
ఆపిల్ తిన్నాక ఇవి తినకండి..
ఆపిల్ తిన్న వెంటనే తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ముల్లంగి లేదా ఊరగాయ వంటివి ఆపిల్ తిన్నాక తినకూడదని గుర్తుంచుకోండి. అలాగే, ఈ పండు తిన్న తర్వాత టీ తాగడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
ఆరోగ్యానికి ఒక వరం
అమ్మమ్మల కాలం నుంచి ఆపిల్ ఆరోగ్యానికి ఒక వరంలా పరిగణిస్తున్నారు. శరీర జీవక్రియను పెంచి ఊబకాయాన్ని తగ్గించే అద్భుతమైన పండు ఆపిల్. ఎముకల ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు అన్ని రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, సరైన సమయంలో.. సరైన విధానంలో తినడం చాలా ముఖ్యం.
Read Also: Hyderabad: ‘సన్‌షైన్’లో రోబోటిక్ వైద్య సేవలు..
Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..
World health day: ఆందోళనకరంగా భారతీయుల