Share News

Hyderabad: ‘సన్‌షైన్‌’లో రోబోటిక్‌ వైద్య సేవలు..

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:07 AM

నగరంలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్బంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ.. రోబోటిక్‌ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన, కచ్చితమైన, సేఫ్టీతో కూడిన శస్త్రచికిత్స నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

Hyderabad: ‘సన్‌షైన్‌’లో రోబోటిక్‌  వైద్య సేవలు..

హైదరాబాద్‌ సిటీ: రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానం అన్ని విభాగాల్లో విస్తరించిందని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి(KIMS Sunshine Hospital) మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి తెలిపారు. ప్రసవం తప్ప అన్ని రకాల వైద్యచికిత్సలు అందించడంలో రాబో కీలకంగా మారిందన్నారు. సోమవారం బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి(Begumpet KIMS Sunshine Hospital)లో సర్జికల్‌ గ్యాస్ట్రో, యూరాలజీ, క్యాన్సర్‌ విభాగాలలో రోబోటిక్‌ సేవలను ఆయన ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: హైదరాబాద్ వాసులకు గోదావరి జలాలు..


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోబోటిక్‌ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన, కచ్చితమైన, సేఫ్టీతో కూడిన శస్త్రచికిత్స నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో ఆరు రోబోలు అందుబాటులో ఉన్నాయన్నారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ విమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సర్జన్‌ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందని తెలిపారు. రోబో సాయంతో నిర్వహించిన హెర్నియా శాస్త్ర చికిత్స వీడియోను డాక్టర్‌ విమలాకర్‌ రెడ్డి ఈ సందర్భంగా పవర్‌ పాయిం ట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 10:07 AM