Share News

నువ్వసలు తండ్రివేనా.. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..

ABN , Publish Date - Apr 08 , 2025 | 07:11 AM

Thailand Man: రెండు వారాల పసి పిల్లాడని కూడా చూడకుండా అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ అరటి చెట్టుకింద నేలపై బాబును పడుకోబెట్టాడు. తర్వాత ఫొటో తీసి దాన్ని భార్యకు పంపాడు.

నువ్వసలు తండ్రివేనా.. భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..
Thailand Man

మత్తుకు బానిసైన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని పుట్టి నెల కూడా కాని బిడ్డను అడవుల పాలు చేశాడు. ఈ దారుణ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని బురిరామ్ ప్రావిన్స్‌కు చెందిన 22 ఏళ్ల ఓరతాయ్ రెండు వారాల క్రితమే ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త ఉటాచి ఓ డ్రగ్ అడిక్ట్. భార్య ప్రసవించి రెండు వారాలు కూడా కాకముందే శృంగారం కోసం ఆమెను బలవంతం చేశాడు. ఓరతాయ్ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో అతడికి కోపం వచ్చింది. భార్యను ఆ పనికి ఒప్పించడానికి ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.


రెండు వారాల బిడ్డను తీసుకుని దగ్గరలోని అడవిలోకి వెళ్లాడు. ఓ చోట నేలపై పడుకోబెట్టి పిల్లాడి ఫొటో తీశాడు. దాన్ని భార్యకు పంపాడు. ఆ సమయంలో ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంది. ఆ ఫొటో చూసి ఓరతాయ్ షాక్ అయింది. తాను ఎందుకు అలా చేశాడో కూడా అతడు చెప్పాడు. భర్త పాడుపనులతో ఆమెకు విరక్తి వచ్చింది. వెంటనే ఆమె గ్రామపెద్దకు సమాచారం ఇచ్చింది. ఇద్దరి మధ్యా జరిగిన ఆన్‌లైన్ చాట్‌ను ఆయనకు కూడా పంపింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు గ్రామానికి వెళ్లారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన భర్త డ్రగ్ అడిక్ట్ అని ఓరతాయ్ పోలీసులకు చెప్పింది.


జూదం కూడా ఆడతాడని అంది. పిల్లాడు పుట్టిన కొన్ని రోజులకే శృంగారంలో పాల్గొనాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతూఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు పిల్లాడిని అడవిలో వదిలేశాడు. అయితే, భార్య ఆరోపణలను ఉట్టాచి ఖండించాడు. భార్యను శృంగారం కోసం వేధించిన మాట వాస్తవమేనన్నాడు. కానీ, పిల్లాడిని ఆ కారణంతో అడవిలోకి తీసుకెళ్లలేదని స్పష్టం చేశాడు. అరటి చెట్టు కింద పడుకోబెట్టి ఫొటో మాత్రమే తీశానన్నాడు. పోలీసులు అతడికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ వాడుతున్నాడన్న నేరం కింద కూడా అతడిపై కేసు నమోదైంది.


ఇవి కూడా చదవండి:

NTR వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు పునఃప్రారంభం

Gold Silver Rates Today: వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి

Updated Date - Apr 08 , 2025 | 07:11 AM