Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
ABN , Publish Date - Apr 07 , 2025 | 08:56 PM
Vaniya Agarwal: కంపెనీ స్థాపకుడు బిల్ గేట్స్, సీఈవో సత్య నాదెళ్ల, మరో ప్రముఖుడు స్టీవ్ తదితరులు హాజరైయ్యారు. ఆ కార్యక్రమంలో గాజాపై ఇజ్రాయెల్ దాడికి మైక్రోసాఫ్ట్ మద్దతు ఇవ్వడాన్ని ఓ ఇండో అమెరికన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు.. వారి రక్తంతో సంబరాలు చేసుకొంటున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వానియా అగర్వాల్ ఎవరంటే..

వానియా అగర్వాల్.. మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తూ.. ఆ కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపడంపై ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో పని చేస్తున్న సంస్థపై తిరుగుబాటు చేసిన ఆమె ఎవరంటూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె లేవనెత్తిన అంశం కూడా పాలస్తీనియన్ల మరణాలకు సంబంధించిందని కావడంతో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటూ పలువురు గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. దీంతో ఆమె ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండే ఏమిటంటే..
వానియా అగర్వాల్ ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లోని సీటెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసింది.
అమెజాన్‌లో అగర్వాల్ మూడు ఏళ్లు పాటు పని చేశారు. 2019,సెప్టెంబర్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా చేరారు.అనంతరం ఆమెకు పదోన్నతి లభించింది. 2023లో మైక్రోసాఫ్ట్‌లో ఆమె చేరారు. ఈ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు.
టెక్ రంగంలోకి అడుగు పెట్టక ముందు అగర్వాల్ వివిధ ఉద్యోగాలు చేశారు. 2016లో ఇల్లినాయిస్‌లోని నేపర్‌విల్లేలో మెడికల్ అసిస్టెంట్‌గా ఆమె పని చేశారు. 2015లో ఆమె టీ కన్సల్టెంట్‌గా.. 2014లో ఆమె కొంతకాలం ఫార్మసీ టెక్నీషియన్‌గా కూడా పని చేశారు. అంతకు ముందు 2012లో ఎట్సీలో రెండు సంవత్సరాల పాటు ఒక చిన్న వ్యాపారాన్ని సైతం నడిపింది. వన్నుష్కా అనే ఓ దుకాణం ఏర్పాటు చేసి.. తద్వారా చేతితో తయారు చేసిన వస్తువులను వినియా అగర్వాల్ విక్రయించేది.
ఇంతకీ వానియా అగర్వాల్ మైక్రోసాఫ్ట్‌ను ఎందుకు వీడిందంటే..
పాలస్తీనియాలోని గాజాపై ఇజ్రాయెల్ యుద్దం చేసింది. ఈ యుద్దానికి మైక్రోసాఫ్ట్ మద్దతు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ మద్దతు ఇవ్వడాన్ని ఆ సంస్థ ఉద్యోగి, ఇండో అమెరికన్ వానియా అగర్వాల్ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే మైక్రోసాఫ్ట్ సంస్థ 50వ వార్షికోత్సవం రెడ్‌మండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంస్థకు చెందిన ప్రముఖులు బిల్ గేట్స్, సత్యా నాదెళ్ల, స్టీవ్ బాల్మర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని వానియా అగర్వాల్ విమర్శించారు. వారి రక్తంతో మనం సంబరాలు చేసుకుంటున్నామని.. అంత ధైర్యం మనకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వానియా అగర్వాల్ ఎవరంటూ నెటిజన్లు శోధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
DilsukhNagar Blasts Case: హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
For National News And Telugu News