Heat relief solutions: సమ్మర్‌లో శరీర వేడి తగ్గేందుకు కొన్ని చిట్కాలు..
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:26 PM
Natural body cooling solutions: వేసవిలో సూర్యుడు భగభగా మండిపోతుంటాడు. రోజురోజుకీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గదు. ఈ కారణంగా శరీరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, ఈ సహజ చిట్కాలతో అధిక వేడి నుంచి ఉపశమనం పొందండి.

Best natural ways to cool your body: ఏప్రిల్ నెల ప్రారంభమైంది. సూర్యకాంతి తీవ్రత పోను పోను మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ తీవ్రమైన వేడి గాలులకు తట్టుకోలేకపోతున్నారు. విపరీతమైన ఉక్కపోత కారణంగా చెమటతో ఇబ్బందిపడుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే శరీరం లోపల కూడా వేడి పెరుగుతుంది. ఇలా జరిగితే అలసట, నీరసం ఆవహించి వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముంది. ఈ పరిస్థితి రాకూడదంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా ముఖ్యం. శరీర వేడిని తగ్గించుకోవడానికి కింద ఇచ్చిన సహజ చిట్కాలను అనుసరించండి.
1) పానీయాలు
చల్లటి నీరు లేదా ఎలక్ట్రోలైట్లు కలిగిన హైడ్రేటింగ్ ద్రవ పానీయాలు శరీరాన్ని లోపల్నుంచి చల్లబరుస్తాయి. కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
2) స్నానం
శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గాలంటే చల్లటి నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. భరించలేనంత ఉక్కపోత మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఈ పని చేయండి. తక్షణమే శరీరంలోని అదనపు వేడి తొలగిపోతుంది.
3) దుస్తులు
వేసవిలో సరైన దుస్తులను ఎంచుకోండి. వేడిని నివారించడానికి తేలికైన, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ఎంచుకోండి. ఇది శరీరానికి గాలి అందేలా చేస్తుంది. అధికవేడిని వేగంగా చల్లబరుస్తుంది.
4) కూలింగ్ ప్యాక్
శరీరంలో అధిక వేడి కారణంగా మీరు సమస్యలను ఎదుర్కుంటుంటే మణికట్టు, మెడ, నుదురు, పాదాలపై చల్లని స్ట్రిప్స్ లేదా ఐస్ స్ట్రిప్స్ వేయడం వల్ల శరీర వేడి వెంటనే తగ్గుతుంది.
5) కెఫిన్ లేదా తీపి పానీయాలు
కెఫిన్ లేదా తీపి పానీయాలకు బదులుగా మజ్జిగ వంటి సహజ పానీయాలు వేసవిలో శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బాడీ హీట్ వేగంగా నియంత్రించడంలో సహాయపడతాయి.
6) నీరు
వేసవిలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. మీరు బయట వేడి వాతావరణంలో పనిచేసేవాళ్లు ఇంతకంటే ఎక్కువ తాగాల్సి ఉంటుంది.
7) విశ్రాంతి
వేసవిలో వీలైనంతవరకూ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి. AC లేదా కూలర్ ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటే శరీర వేడిని నివారించవచ్చు. సూర్యరశ్మి నేరుగా పడే చోట ఉండకండి.
8) పండ్లు, కూరగాయలు
శరీరం సహజంగా చల్లబడాలంటే ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, సిట్రస్ పండ్లు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. అప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండగలుగుతారు.
Read Also: Relationship Tips:మీ భార్యను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా.. అద్భుతమైన టిప్స్ మీకోసం..
Sabja Seeds: సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకుంటే..
Food effects Mood: మీరు ఇష్టంగా తినే ఈ 6 రకాల పదార్థాలతో వల్ల మైండ్