Share News

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 05:16 PM

gutkha khaini : గుట్కా, ఖైనీ తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అదే స్థాయిలో అనారోగ్యానికి గరవుతున్న వారు సైతం పెరుగుతోన్నారు. వీటిలో వాడే పదార్థాలు సైతం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అంతేకాదు..వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Gutka

దేశవ్యాప్తంగా పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తినే వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో వీటిని వినియోగించే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ ఉత్పత్తులు వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి రుచి, సుగంధంతోపాటు మత్తును సైతం కలిగిస్తాయి. అయితే ఈ ఉత్పత్తులు.. ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీటిని వేటితో తయారు చేస్తారంటే..

సాధారణ పదార్థాలు..

రజనీగందా, పాన్ పరాగ్‌తోపాటు ఖైనీ వంటి ఉత్పత్తులు ప్రధానంగా పొగాతో తయారు చేస్తారు. వీటి రుచితోపాటు ఆకర్షణ కోసం అనేక పదార్థాలు కలుపుతారు. ఈ ఉత్పత్తులు బ్రాండ్‌ను బట్టి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. వీటిలో ఉపయోగించే పదార్థాలు మాత్రం ..

పొగాకు (టొబాకో): ఈ ఉత్పత్తులలో ప్రధానంగా పొగాకు ఉపయోగిస్తారు. రజనీగందా, పాన్ పరాగ్‌లో సన్నగా పొడిగా చేసిన పొగాకు లేదా పొగాకు సారంతో వీటిని వినియోగిస్తారు. ఇక ఖైనీలో మాత్రం తడి లేదా సన్నగా కత్తిరించిన పొగాకు ఆకులు వాడతారు. పొగాకులో ముఖ్యంగా నికోటిన్ ఉంటుంది. ఇది మత్తు కలిగిస్తుంది. దీంతో త్వరగా ఈ వ్యసనానికి బానిసలవుతారు.

సున్నం: ఖైనీ, రజనీగందా తయారీలో సున్నం (కాల్షియం హైడ్రాక్సైడ్) విస్తృతంగా వినియోగిస్తారు. ఇది పొగాకులోని నికోటిన్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల వినియోగదారునికి త్వరగా మత్తు కలుగుతుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల నోటిలోని శ్లేష్మ పొరలను దెబ్బ తింటాయి. దీర్ఘకాల వినియోగం కారణంగా.. నోటి క్యాన్సర్‌కు దారి తీస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.


తామలపాకు: పాన్ పరాగ్, రజనీగందాలో తామలపాకు సారం లేదా వాటి పొడిని ఉపయోగిస్తారు. ఇది సాంప్రదాయ పాన్ రుచిని అందిస్తుంది. ఇక తామలపాకు ఆల్కలాయిడ్స్ కలిగి ఉంటుంది. ఇవి మత్తును కూడా పెంచుతోంది.

వక్క (సుపారి): ఈ ఉత్పత్తుల తయారీలో వక్కను వినియోగిస్తారు. వక్కను సన్నగా కత్తిరిస్తారు. లేదా పొడిగా ఉపయోగిస్తారు. వక్క ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇది వ్యసనానికి దారి తీస్తుంది. తరచూ వక్కపొడిని వినియోగించడం వల్ల నోటి ఆరోగ్యానికి హాని కలుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఇక మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు వినియోగం.. రుచి, సువాసనల కోసం.. లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తారు.

తీపి పదార్థాలు: రజనీగంద, పాన్ పరాగ్‌లో రుచి కోసం చక్కెర, గ్లూకోజ్ లేకుంటే.. కృత్రిమ స్వీటెనర్లు ఉపయోగిస్తారు. ఇక కొన్ని బ్రాండ్లు అయితే తేనె లేదా బెల్లం సారాన్ని వీటి కోసం వినియోగిస్తారు.


మెంథాల్, ఇతర సుగంధ రసాయనాలు: మెంథాల్ లేదా పిప్పరమింట్ సారం ఈ ఉత్పత్తుల తయారీలో వాడతారు. వీటి వల్ల చల్లని అనుభూతి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సింథటిక్ సుగంధ రసాయనాలు (ఫ్లేవరింగ్ ఏజెంట్లు) ఉపయోగిస్తారు.

కాటెకు (కత్తా): కాటెకు.. ఇది గోధుమ రంగు సారం, తామలపాకుతో కలిపి ఉపయోగిస్తారు. ఇది రుచితోపాటు దాని రంగును సైతం పెంచుతుంది.

రసాయన సంరక్షకాలు, రంగులు: వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్ పరాగ్‌లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్ వంటి వాటిని ఉపయోగిస్తారు.

మాగ్నీషియం కార్బోనేట్: మరికొన్ని సందర్భాల్లో.. రజనీగంద వంటి ఉత్పత్తులలో సున్నం తీవ్రత తగ్గించడానికి మాగ్నీషియం కార్బోనేట్ వంటి రసాయనాలు జోడిస్తారు. ఈ ఉత్పత్తిని నోటిలో ఉంచుకోవడాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది.


ఉత్పత్తుల వారీగా వివరణ ఇస్తే..

రజనీగందా: ఇది ఒక ప్రముఖ పాన్ మసాలా బ్రాండ్. ఇది తీపి, సుగంధ రుచితో వస్తుంది.ఇందులో పొగాకు, వక్క, తామలపాకు సారం,చక్కెర, మెంథాల్, మసాలా దినుసులతోపాటు సున్నం ఉంటాయి. ఇది సాధారణంగా చిన్న ప్యాకెట్‌లలో లభిస్తుంది. నోటిలో ఉంచుకుని చప్పరించడం లేదా నవలడం కానీ చేస్తారు.

పాన్ పరాగ్: ఇది కూడా పొగాకు తక్కువగా ఉపయోగించి.. వక్క, కాటెకు, తామలపాకు, చక్కెర, యాలకులు, లవంగంతోపాటు కృత్రిమ సుగంధాలుంటాయి. ఇది సాంప్రదాయ పాన్ రుచిని అనుకరిస్తూ.. వినియోగదారులకు తేలికైన అనుభవాన్ని అందిస్తుంది.

ఖైనీ: ఖైనీ సాంప్రదాయకంగా తడి పొగాకు ఆకులతో తయారవుతుంది, ఇందులో సున్నం, కొన్నిసార్లు వక్క కలుపుతారు. ఇది సాధారణంగా చేతితో రుద్ది నోటిలో పెట్టుకుంటారు. కొన్ని ఆధునిక ఖైనీ ఉత్పత్తులలో మెంథాల్ లేదా సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల ప్రమాదాలు.. ఈ ఉత్పత్తులలో పొగాకు, వక్క పోడి వినియోగం కారణంగా.. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్‌తోపాటు ఇతర జీర్ణ సమస్యలకు దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరిస్తోంది. భారతదేశంలో నోటి క్యాన్సర్ కేసులలో 90% పొగాకు వినియోగంతో ముడిపడి ఉన్నాయన్నది సుస్పష్టం.

వ్యసనం: నికోటిన్‌తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి. భారతదేశంలో దాదాపు 20-25% జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలయ్యారని ఓ అంచనా.


నియంత్రణ: భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలున్నాయి. రజనీగందాతో పాటు పాన్ పరాగ్ వంటి బ్రాండ్లు హెచ్చరిక లేబుల్స్‌ కలిగి ఉండాలి. మరికొన్ని రాష్ట్రాలలో ఈ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం సైతం ఉన్నాయి.

చివరగా.. రజనీగందా, పాన్ పరాగ్, ఖైనీ వంటి ఉత్పత్తులు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో తయారవుతాయి. ఈ పదార్థాలు రుచి, మత్తును కలిగిస్తాయి. ఇవి దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ఉత్పత్తుల గురించి అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Updated Date - Apr 14 , 2025 | 06:12 PM