Share News

Atishi: సీఈసీ అర్జెంట్‌ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం లేఖ

ABN , Publish Date - Jan 08 , 2025 | 08:30 PM

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడంపై అతిషి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

Atishi: సీఈసీ అర్జెంట్‌ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం లేఖ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితాకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై మాట్లాడేందుకు తనకు అర్జెంట్‌గా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ముఖ్యమంత్రి అతిషి (Atishi) బుధవారంనాడు కోరారు. ఈ వేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఆమె లేఖ రాశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఓట్లు చేర్చడం, పాత పేర్లు తొలగించడంపై అతిషి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు ప్రియాంకకు ఆహ్వానం


''న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను చేరుస్తున్న విషయాన్ని జనవరి 5న రాసిన లేఖలో మీ దృష్టికి తెచ్చాను. వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని విన్నవించేందుకు సమయం ఇవ్వాలని కోరాను. ఎన్నికలకు మరో 27 రోజులు మాత్రమే ఉన్నందున ఈ అంశానికి అత్యంత ప్రాధానత్య ఇచ్చి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. ఈసారి దేశంలో ఒక్క ఢిల్లీలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నారు. యావద్దేశం, మీడియా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాయి. ఈసీ స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహిస్తుందనే పూర్తి నమ్మకం మాకు ఉంది. దీనిపై వ్యక్తిగతంగా మాట్లాడేందుకు సాధ్యమైనంత త్వరగా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను'' అని ఆ లేఖలో అతిషి కోరారు.


ఏడుగురు ఎంపీలకు బీజేపీ ఆదేశాలు..

కాగా, ఎన్నికల జాబితాలో పెద్దఎత్తున ఓటర్లను చేర్చే బాధ్యతను ఏడుగురు ఎంపీలకు బీజేపీ అప్పగించినట్టు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు ఆరోపించారు. ఈ దిశగా పార్టీ ఎంపీలకు ఆదేశాలు వెళ్లినట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి అతిషి స్వయంగా ఈసీఐని కలుసుకోనున్నట్టు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్ కోరుతూ ఈసీకి అతిషి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: సమాచార కమిషన్‌ పదవులను తక్షణమే భర్తీ చేయండి

ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్‌ పోల్‌’

Read Latest National News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 08:33 PM