Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:28 AM
Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో గవర్నర్ వ్యవహారం సరిగా లేదని మందలించింది.

ఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ మేరకు న్యాయ స్థానం కీలక తీర్పు వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని సుప్రీంకోర్టు తెలిపింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత, రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్ల నియామకం సంబంధిత బిల్లులను కూడా గవర్నర్ ఆర్ ఎన్ రవి. ఆమోదించని విషయం తెలిసిందే. బిల్లులను గవర్నర్ నిరవధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..
Mudra Scheme: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా స్కీం..బిజినెస్ కోసం రూ. 20 లక్షల వరకు ఈజీ రుణాలు
For National News And Telugu News