Share News

BJP: ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్

ABN , Publish Date - Jan 01 , 2025 | 02:53 PM

ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.

BJP: ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖపై బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) మండిపడ్డారు. కేజ్రీవాల్ లేఖ ఒక పబ్లిక్ స్టంట్ అని కొట్టివేశారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.

PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు


దీనిపై త్రివేది స్పందిస్తూ, ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు లేఖ రాసే బదులు సేవా స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్‌ నుంచి కేజ్రీవాల్ నేర్చుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవాభారతి మురికివాడల్లో నివసించే దళితులతో సహా దేశంలోని ప్రజల సంక్షేమం కోసం పాటుపడే అతిపెద్ద సంస్థ అని చెప్పారు.


కేజ్రీవాల్ లేఖలో ఏముంది?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోహన్ భాగవత్‌కు కేజ్రీవాల్ ఒక లేఖ రాస్తూ పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ తప్పిదాలను మీరు ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. ఓటర్లను కొనేందుకు బహిరంగంగానే బీజేపీ డబ్బులు పంచుతోందని, పూర్వాంచల్, దళిత ఓట్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ దృష్టికి ఆయన తెచ్చారు. ఈ చర్యలను మీరు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలను డాక్యుమెంట్లు, డబ్బులతో ఆకట్టుకుంటూ వారిని ఆప్, కేజ్రీవాల్ తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నట్టు బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఫిబ్రవరిలో జరగాల్సి ఉండగా ఇంకా ఎన్నికల తేదీలని ఈసీ ప్రకటించలేదు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికిలపడింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది.


ఇవి కూడా చదవండి..

Sanjay Raut: సంజయ్ రౌత్‌పై పార్టీ కార్యకర్తల దాడి..!

UP: యూపీలో దారుణం.. ఐదుగురు మహిళల హత్య

Updated Date - Jan 01 , 2025 | 03:39 PM