Lunar Eclipse: ఎట్టెట్టా.. గ్రహణాలు తారుమారు!
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:49 AM
ఏదైనా చూసే చూపును బట్టి ఉంటుంది. దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది గ్రహణం! అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.25 గంటలకు సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి రావడంతో.. చంద్ర గ్రహణం ఏర్పడింది.

భూమికి చంద్రగ్రహణమే
కానీ.. ‘బ్లూ ఘోస్ట్’కు సూర్యగ్రహణం
శనివారం వేకువజామున రోదసిలో ఘటన
న్యూఢిల్లీ, మార్చి 15: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా ఉంది కనుక భూమి నీడ చంద్రుడిపై పడి.. సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది. కానీ...‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ చంద్రుడిపై ఉంది. సూర్యుడికి భూమి అడ్డుగా రావడంతో ల్యాండరుకు సూర్యగ్రహణ దర్శన భాగ్యం కలిగింది. ఏదైనా చూసే చూపును బట్టి ఉంటుంది. దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది గ్రహణం! అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.25 గంటలకు సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి రావడంతో.. చంద్ర గ్రహణం ఏర్పడింది. చంద్రుడిపైనున్న ‘బ్లూ ఘోస్ట్’ లూనార్ ల్యాండర్.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి రావడంతో ఏర్పడ్డ సంపూర్ణ సూర్య గ్రహణ దృశ్యాలను చిత్రీకరించింది. అయితే.. చంద్రుడి నుంచి కనిపించే సూర్య గ్రహణాన్ని చిత్రీకరించడం ఇది మొదటిసారి కాదు. 1967లో ‘సర్వేయర్-3’ లూనార్ మిషన్ కూడా అనేక చిత్రాలను భూమికి పంపింది. కాగా.. తాజా చంద్ర గ్రహణం అమెరికా, ఆఫ్రికా, న్యూజిల్యాండ్, రష్యా, ఐరోపా దేశాల్లో కనిపించింది.