CM Stalin: కేంద్రంపై సీఎం స్టాలిన్ ధ్వజం.. రాష్ట్రంలో తిరిగే రైళ్లకు హిందీలో పేర్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:16 AM
ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు.

- తమిళ భాషను అంతమొందించడమే వారి ధ్యేయం
చెన్నై: ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో ప్రతిభాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించడం వారికి భారం అవుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. డీఎంకే పార్టీ పత్రిక ‘మురసొలి’లో పార్టీ శ్రేణులకు ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో తిరిగే రైళ్లకు అందమైన తమిళ పేర్లు పెట్టకుండా హిందీలో పేర్లు పెడుతున్నారని, ఇలాంటివి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం తమిళ భాషను శాశ్వతంగా అంతమొందించే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
ఈ వార్తను కూడా చదవండి: PM Modi: సింహాలతో సయ్యాట!
ఇటీవల తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Prime Minister Modi, President Draupadi Murmu, Governor RN Ravi), వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారని, వీరందరిదీ ఒక ఎత్తయితే, తనకు శుభాకాంక్షల సందేశం పంపిన సోదరి డాక్టర్ తమిళిసె మరో ఎత్తులో నిలిచారని ప్రశంసించారు. మూడు భాషల్లో ఆమె తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషం కలిగించిందని, ఆంగ్లం, తమిళంలోనే కాకుండా తెలుగుభాషలోనూ ఆమె గ్రీటింగ్ చెప్పారని, ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సి ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు హిందీ భాష ఎంచుకోకుండా తెలుగు భాష ఎంచుకోవడం తమిళుల మనస్తతత్త్వాన్ని తెలుపుతోందన్నారు.
తనకు తెలుగు రాయడం, చదువడం రాదని, సోదరి తమిళిసై తెలుగు రాష్ట్రంలో గవర్నర్‌గా పనిచేయడం వల్ల తెలుగులో టైప్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోగలిగారన్నారు. వీటన్నింటిని బట్టి ప్రతిభాషకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిదని, అదే సమయంలో నిర్బంధంగా ఓ భాషను అమలు చేస్తే వారికి గుదిబండగా మారుతుందన్నారు.
తమిళిసైలా రాష్ట్రంలో తమిళం, ఆంగ్లంతో పాటు ఏ భాషనైనా ఐచ్చికంగా ఎంపిక చేసుకుని చదివితే ఎలాంటి సమస్య ఉండదని, అలాకాకుండా తమిళుల మనస్తత్త్వానికి విరుద్ధంగా హిందీ భాష మాత్రమే నేర్చుకోవాలంటూ బలవంతం చేయడాన్నే డీఎంకే ఆది నుంచి వ్యతిరేకిస్తోందని ఆ లేఖలో వివరించారు. రాష్ట్రంలో సీబీఎ్‌సఈ పాఠశాలల్లో హిందీ నేర్చుకోవడాన్ని ఎలా అనుమతిస్తున్నారంటూ కొంతమంది అజ్ఞానులు విమర్శిస్తున్నారని, ఆ పాఠశాలన్నీ కేంద్ర ప్రభుత్వ సిలబ్‌సనే పాటిస్తాయనే విషయం వారికి తెలియకపోవడం గర్హనీయమన్నారు. రాష్ట్ర సిలబ్‌సను పాటించే ఏ పాఠశాలలోనూ త్రిభాషా విద్యావిధానాన్ని అమలు చేయడం లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News