Share News

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:19 PM

చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సూచించారు.

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపే కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా (Sam Pitroda) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. చైనా పట్ల కాంగ్రెస్‌కు ఉన్న అతిమోహానికి పిట్రోడా వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని పేర్కొంది.

PM Modi: ఎన్నికల అడ్డాలో పిఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్


చైనా పట్ల భారత్ ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శిస్తోందని, ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకోవాలని పిట్రోడా సూచించారు. "చైనా నుంచి భారత్‌కు వచ్చే ముప్పు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమెరికా చైనాను తరచు శత్రువుగా పేర్కొంటూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలు ఏకటాటిపైకి రావాల్సి సమయం ఆసన్నమైంది. ఘర్షణాత్మక వైఖరి అవసరం లేదు. మొదట్నించీ మనం అవలభింస్తున్న ఘర్షణాత్మక వైఖరి కొత్త శత్రువులను సృష్టిస్తోంది. భారత్‌కు సరైన మద్దతు దక్కడం లేదు. మనం ఈ వైఖరిని మార్చుకోవాలి. చైనాను శత్రువుగా ఊహించుకోవడం మానుకోవాలి'' అని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కలిసి చైనా నుంచి ఎదురయ్యే ముప్పును అదుపు చేయగలరా అని అడిగిన ప్రశ్నకు శామ్ పిట్రోడా ఈ సమాధానం ఇచ్చారు.


మండిపడిన బీజేపీ

చైనాను శత్రువుగా చూడటం మానుకోవాలని, డ్రాగెన్ నుంచి వచ్చే ముప్పే ఏమిటో తనకు అర్థం కావడం లేదని శామ్ పిట్రోడా చేసిన వైఖ్యలపై బీజేపీ గట్టి సమాధానం ఇచ్చింది. చైనా పట్ల కాంగ్రెస్ అతిమోహానికి 2008లో చైనా కమ్యూనిస్టు పార్టీతో కుదుర్చుకున్న అవగాహనే (MOU) కారణమని విమర్శించింది. 40,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ డ్రాగెన్ నుంచి ముప్పును గుర్తించడం లేదని బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. మరో నేత అజయ్ అలోక్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సలహాదారు శామ్ పిట్రోడా అని, చైనా పీపుల్స్ లిబరేషన్ పార్టీతో రాహల్ గాంధీ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని, యూఎన్ఎస్‌సీలో భారత్ సభ్యత్వాన్ని చైనాకు జవహర్‌లాల్ నెహ్రూ కట్టబెట్టారని, కాంగ్రెస్‌కు, చైనాకు మధ్య మైత్రీబంధం చాలా పాతదని చురకలు వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2025 | 04:19 PM

News Hub