Share News

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 07 , 2025 | 08:44 PM

CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

CWC Meetings: ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్‌గా సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎందుకంటే..
CWC Meetings:

గుజరాత్: అహ్మదాబాద్ వేదికగా రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు కాంగ్రెస్ విస్తృత స్థాయి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ బలోపేతం, పార్టీ పునరుద్ధరణ చేసే లక్ష్యంగా సమావేశంలో చర్చించనున్నారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభకానుంది. ఎల్లుండి(బుధవారం) ఉదయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం జరుగనుంది.


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 64 ఏళ్ల తర్వాత “ఏఐసీసీ” కీలక సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో, సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు, మొత్తం 1500 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని గత ఏడాది (2024) డిసెంబర్ 26వ తేదీన కర్నాటకలోని బెలగావిలో జరిగిన విస్తృత “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” (సీడబ్ల్యూసీ) సమవేశంలో నిర్ణయం తీసుకున్నారు.


ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, రెండు రోజుల పాటు విస్తృత సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల (హిమాచల్, కర్నాటక, తెలంగాణ) ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, ఏఐసీసీ సభ్యులు పాల్గొననున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో ఓ కార్యాచరణను నేతలు రూపొందించుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 08:48 PM