Delhi Assembly Elections: బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే.. కేజ్రీ వెల్లడి
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:38 PM
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై 'ఆప్' కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన క్లెయిమ్ చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రమేష్ బిధూరి (Ramesh Bidhuri)ని అధికారికంగా ఆ పార్టీ ఒకటి, రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్టు తనకు తెలిసిందని కేజ్రీవాల్ చెప్పారు.
Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి
''రమేష్ బిధూరిని సీఎం అభ్యర్థిగా ఒకటి రెండ్రోజుల్లో బీజేపీ ప్రకటించనున్నట్టు మాకు సమాచారం ఉంది. రమేష్ బిధూరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఎంపీగా ఆయన ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో, ఢిల్లీ పట్ల ఆయన విజన్ ఏమిటో చెప్పాలి'' అని కేజ్రీవాల్ తెలిపారు. అధికారంగా బిధూరి పేరు ప్రకటించిన తర్వాత బీజేపీ, ఆప్ ముఖ్యమంత్రుల మధ్య ఢిల్లీ ప్రజల ముందు డిబేట్ కూడా ఉండాలని అన్నారు.
15 రోజుల్లో 13,000 మంది కొత్త ఓటర్లు
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి కొత్త ఓటర్లను తెచ్చారని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు బిజేపీ పథకం ప్రకారం ముందుకు వెళ్తోందని ఆరోపించారు. ''ఇంత తక్కువ వ్యవధిలో 13,000 కొత్త ఓటర్లు ఎలా ప్రత్యక్షమయ్యారు. ఫేక్ ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం యూపీ, బీహార్ నుంచి ఈ ఓటర్లను పట్టుకొచ్చారు. ఈ చర్య ఎన్నికల ప్రక్రియలను బలహీనపరుస్తుంది'' అని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇవి కూాడా చదవండి..
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News