Share News

Rekha Gupta: రోడ్డుపై ఆవుకు రొట్టె విసిరిన వాహనదారుడు.. సీఎం చేతులు జోడించి..

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:15 PM

సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.

Rekha Gupta: రోడ్డుపై ఆవుకు రొట్టె విసిరిన వాహనదారుడు.. సీఎం చేతులు జోడించి..

న్యూఢిల్లీ: రద్దీగా ఉండే రోడ్లపైకి అవులు వంటి మూగజీవాలు కూడా తిరుగుతుంటాయి. కొందరు వాటికి ఆహారం ఇద్దామనుకుని రొట్టెలు వంటివి వాటిపైకి విసురుతుంటారు. ఉద్దేశం మంచిదే అయినా ఇందువల్ల మూగజీవాలు జనాల వైపు దూసుకువచ్చి రోడ్లపై ప్రయాణించే వారికి ప్రమాదం జరగొచ్చు. మూగజీవాలకు కూడా ప్రమాదం జరగొచ్చు. ఇలాంటి సందర్భమే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rekha Gupta)కు ఎదురైంది. జనసమర్దం ఎక్కువగా ఉండే రోడ్డుపై ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ రోడ్లపై ఉన్న ఆవులకు రొట్టె విసిరారు. వెంటనే రేఖాగుప్తా తన కాన్వాయ్ నుంచి కిందకు దిగారు. నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇందువల్ల మూగజీవాలకే కాకుండా, వాహనదారులకు కూడా ప్రమాదమేనని చెబుతూ, మరోసారి అలా చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేఖాగుప్తా స్వయంగా తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఢిల్లీవాసులు రోడ్లపైకి రొట్టె కానీ, ఇతర ఆహార పదార్ధాలు కానీ విసరవద్దని కోరారు.

Supreme Court: బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలలు గడువు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు


''రోడ్లపైకి రొట్టెల్లాంటివి విసరడం వల్ల అవి తినేందుకు ఆవులు, ఇతర జంతువులు వస్తాయి. ఇందువల్ల ఆ జంతువులకే కాకుండా వాహనదారులకు కూడా ప్రమాదం జరగవచ్చు. ఆహారాన్ని అగౌరపరచ కూడదు. అది మన సంస్కృతి. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే గోశాలకు కానీ నిర్దేశిత ప్రదేశాలకు కానీ వెళ్లండి. మూగజీవులను ప్రేమించండి, మన సంస్కృతిని గౌరవించండి, రహదారుల భద్రతను పాటించండి'' అని ఆ ట్వీట్‌లో సీఎం కోరారు.


సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వా్య్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆమెకు సాయంగా నిలిచి ఆ ఆవులను సురక్షితంగా రోడ్డు దాటించారు. ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో ఢిల్లీలోని మోడల్ గోశాల నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించారు.


ఇవి కూడా చదవండి..

Mamata Banerjee: వక్ఫ్ చట్టం అమలు చేయం... అల్లర్లకు దిగొద్దు: మమతా బెనర్జీ

Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Chhattisgarh Encounter: కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Updated Date - Apr 12 , 2025 | 05:26 PM