Share News

Delhi Election 2025 Results: మళ్లీ వైట్‌వాష్.. ఘోరంగా కాంగ్రెస్‌ పరిస్థితి..

ABN , Publish Date - Feb 08 , 2025 | 10:51 AM

2025 Delhi Legislative Assembly Election: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. దాదాపుగా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఒకప్పుడు హస్తినను ఏలిన హస్తం పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది.

Delhi Election 2025 Results: మళ్లీ వైట్‌వాష్.. ఘోరంగా కాంగ్రెస్‌ పరిస్థితి..
Congress Party

దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు కాంగ్రెస్ హవా నడిచేది. దాదాపు 15 ఏళ్లు అక్కడ పాలన సాగించింది హస్తం పార్టీ. బ్రహ్మ ప్రకాశ్ (1952-1955)తో పాటు షీలా దీక్షిత్ (2003-2008), (2008-2013) అక్కడ ముఖ్యమంత్రులుగా పని చేశారు. దశాబ్దం కింద వరకు పెత్తనం చలాయించిన కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో ఢిల్లీలో పట్టు కోల్పోసాగింది. రోజురోజుకీ పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సున్నాకే పరిమితమైంది. ఈసారైనా పుంజుకుంటుందేమో అనుకుంటే మళ్లీ వైట్‌వాష్ ఖాయంగా కనిపిస్తోంది.


పట్టించుకోని ఓటర్లు!

ఢిల్లీలో మరోమారు చేతులెత్తేసింది కాంగ్రెస్. దాదాపుగా అన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కనీసం ఒక్క సీటు కూడా దక్కేలా కనిపించడం లేదు. ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండకపోవడం గమనార్హం. ఒకవైపు బీజేపీ హవా నడిపిస్తోంది. 50 స్థానాలు గెలుచుకునే దిశగా పరుగులు పెడుతోంది కమలం పార్టీ. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీనిస్తోంది. అయితే కాంగ్రెస్ పత్తా లేకుండా పోవడం, మరోసారి వైట్‌వాష్ దిశగా సాగడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన హస్తం పార్టీకి అసలు ఏమైంది? కాంగ్రెస్‌ను ఓటర్లు పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటి? అని వాళ్లు షాక్ అవుతున్నారు.


ఇదీ చదవండి:

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మారుతున్న లెక్కలు..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. కేజ్రీవాల్‌కు ఊహించని షాక్

ఢిల్లీ పీఠం దక్కాలంటే ఎన్ని సీట్లు గెలవాలి.. 3 పార్టీల ధీమా ఏంటి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 11:25 AM