Aadhaar: ఓటుకు ఆధార్ లింక్‌పై 18న ఈసీ భేటీ
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:10 AM
ఈ సమావేశం కేవలం కంటి తుడుపు చర్యేనని, నకిలీ ఓటరు కార్డులపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు ఓటరు కార్డుకు ఆధార్ లింక్ అంటూ దానిపై సమావేశం పెడుతోందని టీఎంసీ ఆరోపించింది.

న్యూఢిల్లీ, మార్చి 15: నకిలీ ఓటరు కార్డులకు చెక్ పెట్టేందుకు వాటికి ఆధార్‌ను లింక్ చేయడంపై ఈనెల 18న కేంద్ర హోంశాఖ, యూఐడీఏఐ సీఈవో, శాసన వ్యవహరాల విభాగం కార్యదర్శితో ఎన్నికల సంఘం(ఈసీ) సమావేశం నిర్వహించనుంది. అయితే, ఈ సమావేశం కేవలం కంటి తుడుపు చర్యేనని, నకిలీ ఓటరు కార్డులపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు ఓటరు కార్డుకు ఆధార్ లింక్ అంటూ దానిపై సమావేశం పెడుతోందని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, ఆధార్, ఓటరు కార్డు లింక్ చేయడంపై మార్చి 30లోగా సలహాలివ్వాలని అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలను ఈసీ ఇప్పటికే కోరింది.