Share News

Union Budget 2025: సామర్థ్యానికి మించి పథకాలు.. బడ్జెట్‌పై చిదంబరం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 09:10 PM

నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌తో ఆర్థిక వృద్ధి పాతబాటలోనే నడక సాగిస్తుందని, 6 నుంచి 6.5 శాతానికి మించదని ఆయన జోస్యం చెప్పారు. ఆర్థిక వృద్ధిపై సీఏఈ 8 శాతం అంచనాలను చేరుకోలేదన్నారు.

Union Budget 2025: సామర్థ్యానికి మించి పథకాలు.. బడ్జెట్‌పై చిదంబరం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2025 (Union Budget 2025)పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) నిశిత వ్యాఖ్యల చేశారు. ప్రభుత్వ కొత్త పథకాలు చాలావరకూ సామర్ధ్యానికి మించి ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Union Budget 2025: బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు.. జనగణన మరింత జాప్యం


''బడ్జెట్ నిండా కొత్త పథకాలు పథకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ప్రభుత్వ సామర్థ్యానికి మించి ఉన్నాయి. 2025-26 బడ్జెట్‌లో పన్నులు చెల్లించే మధ్యతరగతి ప్రజలను, బీహార్ ఓటర్లను ఆకర్షిస్తుంది. బడ్జెట్‌తో ఉద్యోగులు మాత్రమే సంతోషంగా ఉంటారు'' అని చిదంబరం అన్నారు. అయితే ప్రజా కార్యకలాపాల నిర్వహణ కష్టమవుతుందని విశ్లేషించారు. ప్రజా కార్యకాలాపాల నిర్వహణ పటిష్టతకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్న చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ సలహాలను ప్రధానమంత్రి, ఆర్థిక మంతి పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఆర్థిక వృద్ధి పాతబాటలోనే నడక సాగిస్తుందని, 6 నుంచి 6.5 శాతానికి మించదని ఆయన జోస్యం చెప్పారు. ఆర్థిక వృద్ధిపై సీఏఈ 8 శాతం అంచనాలను చేరుకోలేదన్నారు. 1991, 2004లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను చిదంబరం గుర్తుచేస్తూ, డీ-రెగ్యులేట్ విషయాన్ని ఆర్థిక మంత్రి (నిర్మలా సీతారామన్) పట్టించుకోలేదని చెప్పారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ సలహాను ఏమాత్రం, ఎఫ్ఎం, పీఎం పట్టించుకోలేదని చాలా స్పష్టంగా అర్ధమవుతోందన్నారు.


జీఎస్‌టీ, పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గించి ఉండొచ్చు..

ప్రజలకు బడ్జెట్‌ వల్ల ఎలాంటి ఉపశమనం లేదని, జీఎస్‌టీ, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తే ఉపశమనం ఉండేదన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వేతనాలు పెంచి ఉండొచ్చని, స్టాట్యుటరీ కనీస వేతనాలు పెంచి ఉండవచ్చని అన్నారు. బీహార్ ప్రజలకు ఉపశమనం కలిగితే తనకూ సంతోషమేనని, కానీ మిగతా ప్రజల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలోని రైతులకు ఎలాంటి ఉపశమనం కలిగిందని తాను అనుకోవడం లేదని అన్నారు. రైల్వేలపరంగా చూసినప్పుడు 2024-25లో రూ.2,12,786 కోట్లు ఖర్చు చేశారని, ఈ ఏడాది రూ.766 కోట్లు పెంచారని, 4 శాతం ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు దానిని రూ.10,000 కోట్లకు పెంచి ఉండవచ్చని అన్నారు. బడ్జె్ట్‌ను మరింత నిశితంగా పరిశీలించి లోటుపాట్ల గురించి తిరిగి మాట్లాడతామని చిదంబరం చెప్పారు.


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 09:10 PM