Share News

Rahul Gandhi: ఆయనకు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు: రాహుల్

ABN , Publish Date - Jan 15 , 2025 | 12:13 PM

దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని, దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: ఆయనకు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు: రాహుల్

న్యూఢిల్లీ: ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. బుధవారం ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ (Soni Gandhi) ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikharjuna Kharge) నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవానానికి ఇందిరాభవన్‌గా నామాకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, కెఎస్ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని, దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని వ్యాఖ్యానించారు.

ఈ వార్త కూడా చదవండి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..


రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్

కాంగ్రెస్ భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, తర తమ బేధాలు ఉండవని, రాజ్యాంగంలో అదే రాసి ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్‌లో పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయన్నారు. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెబుతున్నారని, బ్రిటీష్ మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదని విమర్శించారు. వారికి త్రివర్ణ పతాకంపై గౌరవం లేదని, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ భావజాలం ఇవాళ్టిదో.. నిన్నటిదో కాదని.. వేల సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ వేల ఏళ్లుగా మా ఐడియాలజీ కొనసాగుతూ వచ్చిందని అన్నారు. గురునానక్, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు.. వీళ్లంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనా.. అని ప్రశ్నించారు. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ భవనంలో ఉన్న అందరూ ఆ భావజాలాన్ని కాపాడేవారేనని.. బీజేపీకి లొంగిపోయేవారు కాదని అన్నారు. ఈ భవంతి బయట మిలియన్ల కొద్దీ ప్రజలు మన భావజాలానికి మద్దతుగా ఉన్నారని, ఈ భావజాలం దేశం నలుమూలలకు మరింతగా విస్తరించాలని రాహుల్ గాంధీ పిలుపిచ్చారు.


పార్టీ పెద్దలతో రేవంత్..

ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు ఢిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్‌ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్రమంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు ఉంటారు. అనంతరం గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్‌ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళతారు. సింగపూర్‌కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం అక్కడ జరిగే బిజినెస్ మీట్‌లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగాలమ్మ గుడిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు..

కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 15 , 2025 | 12:13 PM