Share News

Saharanpur Tragedy: ప్రియురాలి కోసం ప్రాణం తీసుకున్నాడు.. ఆమెకు కన్నీళ్లు మిగిల్చాడు..

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:21 AM

Saharanpur Tragedy: ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతు చెట్టుకు వేలాడుతున్న యువకుడి శవాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి ఓ యువతి శవంపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. పోలీసులు ఆమెను పక్కకు తీసుకురావటానికి నానా కష్టాలు పడ్డారు.

Saharanpur Tragedy: ప్రియురాలి కోసం ప్రాణం తీసుకున్నాడు.. ఆమెకు కన్నీళ్లు మిగిల్చాడు..
Saharanpur Tragedy

ప్రేమ కావచ్చు.. పెళ్లి కావచ్చు.. గొడవలు లేకుండా సాఫీగా సాగటం అన్నది అసాధ్యం. ఒక వేళ ఆ బంధంలో గొడవలు లేవంటే.. ఇద్దరి మధ్యా ప్రేమ లేదని అర్థం. ఒకరిని ఒకరిని ‘బాగానే ఉన్నాం‘ అని మోసం చేసుకోవటమే. అయితే.. గొడవల వల్ల బంధం బలపడాలే కానీ.. ఎందుకురా ఇదంతా అనిపించకూడదు. గొడవలు తారాస్థాయికి చేరే కొద్ది బంధం బలహీనపడుతుంది. బంధం బలహీనపడ్డం సంగతి తర్వాత.. ఎదుటి వ్యక్తిని వదులుకోలేక.. కలిసి ఉండలేక ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకోవటం జరుగుతుంది. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యువకుడు ప్రియురాలితో గొడవపడి ప్రాణాలు తీసుకున్నాడు. అది కూడా ఆమె చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా, బారుఘర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల సమ్‌రెజ్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. తరచుగా బయట కలుస్తూ ఉండేవారు. ఫోన్‌లో కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆదివారం ఉదయం ఇద్దరూ ఊరికి బయట ఉన్న పొలాల్లో కలుసుకున్నారు. మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ, ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో యువతి కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయింది. సమ్‌రెజ్ వెళుతున్న ఆమె చున్నీ లాగి తీసుకున్నాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత అదే చున్నీతో అక్కడే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు.


ఉదయం పొలాల వైపు వచ్చిన ఓ రైతు చెట్టుకు వేలాడుతున్న సమ్‌రెజ్ శవాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్లే సమయానికి యువకుడి ప్రియురాలు అతడి శవంపై పడి ఏడుస్తూ ఉంది. పోలీసులు ఎంత ఓదార్చినా ఆమె వినలేదు. బలవంతంగా ఆమెను పక్కకు తీసుకువచ్చారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కుటుంసభ్యుల్ని, స్థానికుల్ని విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. యువకుడి మరణానికి సరైన కారణం ఏంటో తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి:

5 నెలలుగా తలనొప్పి.. సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు ఊరట..కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..

Updated Date - Apr 07 , 2025 | 07:21 AM