Share News

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు చట్టబద్దతపై మరికొన్ని గంటల్లో సుప్రీంలో విచారణ

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:04 PM

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు చట్టబద్దతపై పలువురు పిటిషన్ల దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సుప్రీంకోరు బుధవారం విచారించనుంది. మధ్యహ్నాం 2.00 గంటలకు ఈ పిటిషన్లను విచారించనుంది.

Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు చట్టబద్దతపై మరికొన్ని గంటల్లో సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టబద్దతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలైనాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు విచారించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది.

ఈ పిటీషన్లను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్‌తోపాటు వైసీపీ, డిఎంకె, సీపిఐ, టీవికే అధినేత విజయ్ సహా మరికొన్ని ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి.


అయితే వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దగ్గరైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు సైతం వినాలని పలు రాష్ట్రాల పిటిషన్లు వేశాయి. ఇక అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు, ఈ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే.

వక్ఫ్ బిల్లుకు చట్టబద్దత కల్పించడంపై దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి పూర్తిగా హింసాత్మకంగా మారింది. మరోవైపు వక్ఫ్ బిల్లు చట్టబద్దత కల్పించడంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. మోదీ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఈ బిల్లును ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. పని చేయని సీసీ కెమెరాలు..

Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..

National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు

BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త

Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..

PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..

For National News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 10:04 PM