Share News

Stalin: కేజ్రీవాల్‌ లాగే స్టాలిన్‌ కూడా జైలుకే

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:14 AM

తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో శనివారం అన్నాడీఎంకే బూత్‌ కమిటీల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టాస్మాక్‌లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఈడీ ప్రకటించిందని గుర్తు చేశారు.

Stalin: కేజ్రీవాల్‌ లాగే స్టాలిన్‌ కూడా జైలుకే

చెన్నై, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మద్యం అవినీతి కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ బాటలోనే తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా జైలుకెళ్తారని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై వ్యాఖ్యానించారు. తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో శనివారం అన్నాడీఎంకే బూత్‌ కమిటీల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టాస్మాక్‌లో రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఈడీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటికే 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు అడ్రస్‌ లేకుండా పోయాయని తెలిపారు. మద్యం అవినీతి కేసులో ఆమ్‌ ఆద్మీకి చెందిన సిసోడియా, కేజ్రీవాల్‌ జైలు కెళ్లారని, ఆ కోవలోనే మంత్రి సెంథిల్‌ బాలాజీ, ఆ తర్వాత స్టాలిన్‌ జైలుకెళ్లడం ఖాయమన్నారు.


ఇవి కూడా చదవండి..

Slap Fight: చెంపలు పగిలేగా కొట్టుకున్న బీజేపీ నేత, పోలీస్ ఆఫీసర్.. వీడియో వైరల్

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 03:14 AM