Minister: వామ్మో.. మంత్రిగారు అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Jan 14 , 2025 | 09:39 AM
భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు.
- గవర్నర్‌కు అహంకారం
- సీనియర్ మంత్రి దురైమురుగన్ ధ్వజం
- వాకింగ్ కోసమే ఆయన అసెంబ్లీ పర్యటన: ఉదయనిధి ఎద్దేవా
చెన్నై: భారతదేశంపై, భారత రాజ్యాంగంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు నమ్మకంలేదని, ఆయనకు అహంకారం ఎక్కువని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) చేసిన ఆరోపణలపై సీనియర్ మంత్రి దురైమురుగన్(Senior Minister Duraimurugan), ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మండిపడ్డారు. వేలూరులో సోమవారం ఉదయం దురైమురుగన్ మీడియాతో మాట్లాడుతూ... దశాబ్దాలుగా శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ముందు తమిళ తల్లి ప్రార్థన,
ఈ వార్తను కూడా చదవండి: Maha Kumbh Mela: త్రివేణి సంగమం భక్తజన సంద్రం
ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలపించటం ఆనవాయితీ అని, దానిని తోసిరాజని తన ప్రసంగానికి ముందే జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ మొండిపట్టుపట్టడం గర్హనీయమన్నారు. తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించరని ముందుగానే గవర్నర్‌కు తెలుసు కనుకనే జాతీయ గీతం పాడలేదన్న సాకుతో సభ నుండి నిష్క్రమించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఎంతో హుందాగా వ్యవహరించారన్నారు. గవర్నర్ అసెంబ్లీని అవమానించడం చిన్నపిల్లాడి చేష్టలా ఉందని విమర్శించారని,
రాజ్యాంగం ద్వారా వచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలని మాత్రమే కోరారని తెలిపారు. ఇంతమాత్రానికే ముఖ్యమంత్రికి అహంకారం ఎక్కువని గవర్నర్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి ఆర్‌ఎన్ రవికి తాను గవర్నర్‌ననే అహంకారం ఉందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి గవర్నర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ గవర్నర్ అసెంబ్లీకి వచ్చేది ప్రసంగం చేయడానికి కాదని, వాకింగ్ చేయడానికి మాత్రమేనని యెద్దేవా చేశారు.
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Read Latest Telangana News and National News