Zomato Lays Off: 600 మంది ఉద్యోగులపై జొమాటో వేటు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:46 AM
జొమాటో 600 మంది ఉద్యోగులను తొలగించింది. పేలవమైన పని తీరు, సమయపాలన దెబ్బతినడం వల్ల కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌పై వేటు వేసినట్టు ప్రకటించింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఏడాది క్రితం విధుల్లోకి తీసుకున్న వారిలో దాదాపు 600 మంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌పై హఠాత్తుగా వేటు వేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఒక నెల జీతాన్ని పరిహారంగా చెల్లించి సాగనంపింది. పేలవమైన పని తీరు, సమయపాలన పాటించకపోవడాన్ని కారణంగా చూపి వేటు వేసింది. హైదరాబాద్, గురుగ్రామ్‌లోని కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో మిగిలిన సిబ్బంది కూడా ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రొగ్రామ్(జడ్‌ఏఏపీ) కింద ఏడాది క్రితం 1500 మందిని జొమాటో ఉద్యోగంలోకి తీసుకుంది. వారిలో 600 మందిపైనే ఇప్పుడు వేటు వేసింది. జొమాటో వృద్ధి రేటు మందగించడం, జొమాటో అనుబంధ విభాగం బ్లింకిట్ నష్టాలు పెరుగుతుండడంతో వాటిని తగ్గించుకునేందుకు జొమాటో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని కథనాలు వెలువడ్డాయి. కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో ఏఐ వినియోగంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతోనే జొమాటో సిబ్బందిపై వేటు వేసిందని పేర్కొన్నాయి.
Zomato layoffs, Zomato employee reduction, customer support job cuts, Zomato growth decline, Zomato job security, AI customer support Zomato, job cuts in India, Zomato corporate restructuring, Zomato Blinkit losses, Zomato employee impact