Share News

Mango: మామిడి- బెల్లం షర్బత్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:33 AM

వేసవిలో మామిడి కాయలతో తయారైన షర్బత్ తాగటం దాహం తీరుస్తుంది, రుచికరంగా కూడా ఉంటుంది. పంచదార లేకుండా ఈ షర్బత్ తయారుచేస్తే బ్లడ్ షుగర్ పెరగకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

Mango: మామిడి- బెల్లం షర్బత్‌

వేసవి వచ్చిందంటే మామిడి కాయలు విరివిగా దొరుకుతాయి. వీటితో షర్బత్‌ చేసుకుంటే దాహం తీరటంతో పాటుగా తాగటానికి రుచిగా కూడా ఉంటుంది. అయితే చాలా మంది ఈ షర్బత్‌లో పంచదార వేస్తారు. దీని వల్ల బ్లడ్‌ షుగర్‌ విలువలు పెరుగుతాయి. అలా పెరగకుండా పంచదార వేయని షర్బత్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం.

తయారీ విధానం

ప్రెషర్‌ కుక్కర్‌లో మూడు పుల్లటి మామిడి కాయలను వేసి ఉడకపెట్టండి.

మామిడికాయలు ఉడికిన తర్వాత తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోండి.

ఈ గుజ్జులో అర గ్లాసు బెల్లం పొడి, రుచికి తగినట్లుగా నల్ల ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి వేయండి.

ఈ మిశ్రమంలో తగినన్ని ఐసు ముక్కలు, మూడు చిన్న గ్లాసుల నీళ్లు పోసి మిక్సీలో బాగా తిప్పిండి. షర్బత్‌ రెడీ.

Updated Date - Apr 09 , 2025 | 01:33 AM