Share News

Trump New Visa Rule విదేశీయులకు రిజిస్ట్రేషన్ ప్రూఫ్ తప్పనిసరి..అమెరికా మరో నిర్ణయం

ABN , Publish Date - Apr 12 , 2025 | 09:06 PM

అమెరికాలో ఉంటున్న వారు విదేశీయులు తమ పేర్లను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఇప్పటికే వీసా, గ్రీన్ కార్డు ఉన్న వారు మాత్రం వాటిని నిత్యం తమ వెంటే పెట్టుకోవాలని పేర్కొంది.

Trump New Visa Rule విదేశీయులకు రిజిస్ట్రేషన్ ప్రూఫ్ తప్పనిసరి..అమెరికా మరో నిర్ణయం
US Immigration New Rule

వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా అనేక చర్యలు చేపడుతున్న ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వీసాలు, గ్రీన్ కార్డుల ఉన్న విదేశీయులు ఈ ధ్రువీకరణ పత్రాలను నిత్యం తమ వెంటే ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వలసదారులు ప్రభుత్వం వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్న ఆదేశాలకు కోర్టు అనుమతించడంతో ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 11 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.

ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్‌ పేరిట ఈ ఆదేశాలను జారీ చేశారు. 1940ల నాటి చట్టం ఆధారంగా ఈ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నాటి చట్టం ప్రకారం, అమెరికాకు వలసొచ్చిన వారు కచ్చితంగా ప్రభుత్వం వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, ఈ చట్టం పూర్తి స్థాయిలో ఇంతవరకూ అమలు కాలేదు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ట్రంప్ తాజాగా నిర్ణయించుకున్నారు.


తాజా మార్గదర్శకాల ప్రకారం, 14 ఏళ్ల దాటిన వారు అమెరికా పౌరసత్వం లేకపోతే ప్రభుత్వం వద్ద తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. 14 ఏళ్ల దాటిన చిన్నారుల తల్లిదండ్రులే వారి పేర్లను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 11 తరువాత అమెరికాకు వచ్చిన వారందరూ అగ్రరాజ్యంలో కాలుపెట్టిన 30 రోజుల్లోపు పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్పును కూడా 10 రోజుల్లోపు తెలియజేయాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే 5 వేలకు పైగా జరిమానా చెల్లించే అవకాశం ఉంది.

ఇక వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు ఉన్న వారిని ఈ రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయించారు. దీంతో, భారతీయులకు కొంత వరకూ ఊరట దక్కినట్టైంది. అయితే, వీరందరూ నిత్యం తమ వెంట వీసా లేదా గ్రీన్ కార్డుకు సంబంధించి డాక్యుమెంట్స్ వెంటనే ఉంచుకోవాలి. అధికారులు అడగ్గానే చూపించాలి.


2022 నాటి లెక్కల ప్రకారం, అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారు. అయితే, మొత్తం అక్రమ వలసదారుల్లో వీరి వాటా కేవలం 2 శాతమే. అయితే, అక్రమ వలసదారులు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన నివాసార్హత వచ్చినట్టు కాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 09:07 PM